(1 / 6)
ఏపీలో కొత్త రేషన్ కార్డులు, ఈకేవైసీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందిస్తామని తెలిపారు.
(2 / 6)
గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.
(3 / 6)
ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాలశాఖ సేవలు అందుబాటులోకి తేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.
(4 / 6)
ఏడాదిలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేశామన్నారు.
(5 / 6)
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారన్నారు.
(6 / 6)
పెళ్లి కాకుండా 50 ఏళ్లు దాటి, ఒంటరిగా ఉన్నవాళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా తొలిసారిగా రేషన్ కార్డులు అందజేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇతర గ్యాలరీలు