ఏపీ పాలిసెట్ - 2025 : నేటి నుంచే కౌన్సెలింగ్ ప్రారంభం - ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి-ap polycet 2025 counseling starts from today key details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీ పాలిసెట్ - 2025 : నేటి నుంచే కౌన్సెలింగ్ ప్రారంభం - ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

ఏపీ పాలిసెట్ - 2025 : నేటి నుంచే కౌన్సెలింగ్ ప్రారంభం - ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

Published Jun 20, 2025 12:11 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 20, 2025 12:11 PM IST

ఇవాళ్టి నుంచి ఏపీ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ షురూ కానుంది. ఎంట్రెన్స్ లో అర్హత సాధించిన విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. ర్యాంక్ తో పాటు వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. polycet.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫీజు చెల్లింపుతో పాటు మిగతా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి (జూన్ 20) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇది జూలై 1వ తేదీతో పూర్తవుతుంది.

(1 / 7)

మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ అభ్యర్థుల వరకు ఫీజు చెల్లించుకోవాలి. ఇందుకు జూన్ 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇక వెబ్ ఆప్షన్లకు జూన్ 30 వరకు గడువు ఉంటుంది. జూలై 3వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత పాలిసెట్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

(2 / 7)

ఏపీ పాలిసెట్ - 2025లో అర్హత సాధించిన విద్యార్థులు https://polycet.ap.gov.in/DefaultPage.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి.

(3 / 7)

ఫీజు చెల్లించే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్, పదో తరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్ వివరాలను ఎంట్రీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత… కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. మీ ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

(4 / 7)

జూలై 3వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత పాలిసెట్ సీట్ల కేటాయింపు ఉంటుంది.అలాట్ మెంట్ కాపీని https://polycet.ap.gov.in/DefaultPage.aspx వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాట్ మెంట్ కాపీని సీటు పొందిన కాలేజీలో సమర్పించి.. సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి.

(5 / 7)

జూలై 3వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత పాలిసెట్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

అలాట్ మెంట్ కాపీని https://polycet.ap.gov.in/DefaultPage.aspx వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాట్ మెంట్ కాపీని సీటు పొందిన కాలేజీలో సమర్పించి.. సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి.

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే  convenorpolycetap2025@gmail.com కు మెయిల్ చేయవచ్చు. ఇక  7995681678, 7995865456, 9177927677 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

(6 / 7)

గత నెలలోనే ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు https://polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు