AP Liquor Old Brads : ఏపీలో మందుబాబులు ఫుల్ ఖుషీ, పాత బ్రాండ్లతో కొత్త షాపులు కళకళ- మద్యం రేట్లు ఇవే-ap new liquor shops open old brands available liquor latest rates new ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Liquor Old Brads : ఏపీలో మందుబాబులు ఫుల్ ఖుషీ, పాత బ్రాండ్లతో కొత్త షాపులు కళకళ- మద్యం రేట్లు ఇవే

AP Liquor Old Brads : ఏపీలో మందుబాబులు ఫుల్ ఖుషీ, పాత బ్రాండ్లతో కొత్త షాపులు కళకళ- మద్యం రేట్లు ఇవే

Updated Oct 16, 2024 02:24 PM IST Bandaru Satyaprasad
Updated Oct 16, 2024 02:24 PM IST

AP Liquor Old Brads : ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి ప్రైవేట్ మద్యం షాపుల్లో విక్రయాలు మొదలయ్యాయి. ఇటీవల లాటరీలో షాపులు దక్కించుకున్న వాళ్లు కొత్త షాపులు తెరిచారు. మళ్లీ పాత బ్రాండ్లు కనిపిస్తుండడంతో మందుబాబు ఖుషీ అవుతున్నారు. అయితే రేట్ల విషయంలో గందరగోళం నెలకొంది.

ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి ప్రైవేట్ మద్యం షాపుల్లో విక్రయాలు మొదలయ్యాయి. ఇటీవల లాటరీలో షాపులు దక్కించుకున్న వాళ్లు కొత్త షాపులు తెరిచారు. దీంతో మందుబాబులు క్యూకట్టారు. 

(1 / 8)

2019కి ముందున్న మద్యం బ్రాండ్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దీంతో మందుబాబులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, ఇంపీరియల్ బ్లూ వంటి బ్రాండ్లను చూసి మందుబాబులు ఆనందంలో తేలియాడుతున్నారు. మద్యం షాపుల్లో నగదుతో పాటు డిజిటల్ పేమెంట్లను తీసుకుంటున్నారు. 

(2 / 8)

వైసీపీ హయాంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించింది. భారీగా రేట్లు పెంచి, ఎప్పుడూ వినని బ్రాండ్లను విక్రయించారని మందుబాబులు వాపోయేవారు. వైసీపీ ఓటమికి మద్యం పాలసీ కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్... ప్రైవేట్ మద్యం షాపులను అందుబాటులోకి తెచ్చింది. పాత మద్యం బ్రాండ్లను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో విక్రయించిన మద్యాన్ని నిలిపివేసింది. దీంతో పాటు 99 రూపాయలకే మద్యాన్ని విక్రయిస్తుంది. 

(3 / 8)

కొత్త షాపుల నుంచి స్టాక్ పై ఆర్డర్స్ అందుతున్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఆర్జీల మేరకు ఆయా ప్రాంతాలకు అన్ని పాత బ్రాండ్లు, డిమాండ్ మేరకు సప్లై చేస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అన్ని బ్రాండ్లపై రూ.50 నుంచి రూ. 100 వరకు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ఏపీలో మద్యం ధరలు తగ్గాయని ప్రచారం జరుగుతున్నా... పాత ధరలకే విక్రయిస్తున్నారని మందుబాబులు అంటున్నారు. అన్ని బ్రాండ్ల మీద రూ.100 చొప్పున తగ్గించినట్లు ప్రభుత్వం జీవో చెబుతోంది.  

(4 / 8)

ఏపీ అసెంబ్లీ ప్రచారంలో మద్యం ఒక ప్రచారాస్త్రం అయ్యింది. తాము అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. బంఫర్ మెజార్టీతో అధికారం చేపట్టిన కూటమి పార్టీలు... తమ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని మందుబాబులు అంటున్నారు. కొత్త మద్యం పాలసీలో మద్యం రేట్లు మరింత తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.  

(5 / 8)

విస్కీ బ్రాండ్ సెగ్మెంట్ లో హార్సెస్ సెలెక్టెడ్ విస్కీ 180 ఎంఎల్ రూ.130, 750 ఎంఎల్ రూ. 750 ధర నిర్ణయించారు. నేవీ బ్లూ క్లాసిక్ విస్కీ రేటు 180 ఎంఎల్ రూ. 150, ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ రేటు 750 ఎంఎల్ రూ. 490గా నిర్ణయించారు.  బ్లెండెడ్ స్కాచ్ విస్కీ రేటు 750 ఎం ఎల్ రూ. 2500,  350 ఎంఎల్ రూ. 1250గా ఉంది. విస్కీ స్కాచ్ ధర మొత్తంగా రూ. 130 నుంచి రూ. 2500 మధ్య ఉంది.

(6 / 8)

బ్రాండీ విభాగంలో కైరోన్ రేర్ బ్రాండీ 180 ఎంఎల్ రేటు రూ.300, నెపోలియన్ బ్రాండ్ విస్కీ రేటు 750 ఎంఎల్ రూ.1180గా ఉంది. బ్రాండీ విభాగంలో రూ. 300 నుంచి రూ.1200 వరకు వివిధ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. రమ్ సెక్షన్ లో ఓల్డ్ మంక్ స్పెషల్ రేర్ రమ్ 180 ఎంఎల్ ప్రైస్ రూ. 230, బకార్డి లైమన్ అల్ట్రా ప్లాటినమ్ ఒరిజినల్ సిట్రస్ రమ్ 750 ఎంఎల్ ప్రైస్ రూ. 1320గా నిర్ణయించారు.  

(7 / 8)

వోడ్కా సెక్షన్ లో మ్యాజిక్ మూమెంట్స్ గ్రీన్ ఆపిల్ ప్లేవర్ 180 ఎంఎల్ ధర రూ. 230, జునో సూపీరియర్ పింక్ వోడ్కా 750 ఎంఎల్ రేటు రూ.1030గా ఉంది.  వైన్ సెక్షన్ లో ఫ్రాతెల్లి షిరాజ్ 180 ఎంఎల్ ధర రూ. 410, గరిష్టంగా రూ. 2880 గా నిర్ణయించారు. జిన్ సెక్షన్ లో ఒక బ్రాండ్ మాత్రమే 750 ఎంఎల్ ధర రూ. 2250గా ఉంది.  బ్రీజర్ సెగ్మెంట్ లో బ్రీజర్ ప్లాటినమ్ టాంగీ క్రాన్ బెర్రీ రేటు రూ. 130గా ఉంది. బీర్ సెక్షన్ లో కింగ్ ఫిషర్, నాకౌట్ బ్రాండ్స్ రూ. 180 నుంచి  గరిష్ఠంగా రూ. 270 వరకు ధరలు ఉన్నాయి.

(8 / 8)

వోడ్కా సెక్షన్ లో మ్యాజిక్ మూమెంట్స్ గ్రీన్ ఆపిల్ ప్లేవర్ 180 ఎంఎల్ ధర రూ. 230, జునో సూపీరియర్ పింక్ వోడ్కా 750 ఎంఎల్ రేటు రూ.1030గా ఉంది.  
వైన్ సెక్షన్ లో ఫ్రాతెల్లి షిరాజ్ 180 ఎంఎల్ ధర రూ. 410, గరిష్టంగా రూ. 2880 గా నిర్ణయించారు. జిన్ సెక్షన్ లో ఒక బ్రాండ్ మాత్రమే 750 ఎంఎల్ ధర రూ. 2250గా ఉంది.  బ్రీజర్ సెగ్మెంట్ లో బ్రీజర్ ప్లాటినమ్ టాంగీ క్రాన్ బెర్రీ రేటు రూ. 130గా ఉంది. బీర్ సెక్షన్ లో కింగ్ ఫిషర్, నాకౌట్ బ్రాండ్స్ రూ. 180 నుంచి  గరిష్ఠంగా రూ. 270 వరకు ధరలు ఉన్నాయి.

ఇతర గ్యాలరీలు