AP Free Bus Scheme: కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు వేళ ఏపీ మంత్రుల బృందం పర్యటన, ఉచిత బస్సు ప్రయాణాల పరిశీలన
- AP Free Bus Scheme: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలను పెంచిన వేళ ఏపీ మంత్రుల బృందం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పరిశీలించేందుకు ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఉగాది నుంచి ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని ఏపీ భావిస్తోంది.ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారుల బృందం అక్కడ పర్యటిస్తోంది.
- AP Free Bus Scheme: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలను పెంచిన వేళ ఏపీ మంత్రుల బృందం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పరిశీలించేందుకు ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఉగాది నుంచి ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని ఏపీ భావిస్తోంది.ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారుల బృందం అక్కడ పర్యటిస్తోంది.
(1 / 8)
ఏపీలో సూపర్ సిక్స్ ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని టీడీపీ ప్రకటించింది. కొత్త ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలులో జరుగుతున్న జాప్యంపై విమర్శులు ఎదురవుతున్నా సాంకేతిక కారణాలతో వాయిదా పడుతోంది. దీంతో కర్ణాటకలో పథకం అమలు తీరును ఏపీ మంత్రులు పరిశీలిస్తున్నారు.
(2 / 8)
ఏపీలో ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అయా జిల్లాల పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లయినా, రోజుకు ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు చిరునమాా ఆధారంగా ప్రయాణాలకు అనుమతిస్తారు. సంక్రాంతి నుంచి పథకాన్ని మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించినా ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలంటే 3,500 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరమని ఆర్టీసీ అధికారులు సీఎంకు వివరించారు. దీంతో పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల్లో ఏపీ మంత్రులు పర్యటిస్తున్నారుర.
(3 / 8)
ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పరిశీలించేందుకు ఏపీ మంత్రులు బెంగుళూరులో పర్యటించారు. మరోవైపు ఉచిత ప్రయాణ పథకంతో వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకు కర్ణాటకలో 15శాతం ఛార్జీలను గురువారం నుంచి పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
(4 / 8)
ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండువేలు కొత్త బస్సులు, అద్దె బస్సులు ఉంటేనే ఉచిత ప్రయాణం హామీ అమలు చేయగలమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం ఉందని, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ 94 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. దీంతో పాటు ప్రతి నెలా ఆర్టీసీపై రూ.265 కోట్ల భారం పడనుంది.
(5 / 8)
మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించే క్రమంలో కర్ణాటకలో రవాణా సంస్థలు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ క్రమంలో ఏపీలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు మంత్రుల బృందం ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, ఇతర కారణాల వల్ల ప్రభావితమైన కేఎస్ఆర్టీసీ నిర్వహణ వ్యయాలను కవర్ చేయడమే లక్ష్యంగా 10 ఏళ్ల విరామం తర్వాత ఛార్జీలను పెంచినట్టు ఆర్టీసీ చెబుతోంది. ఐదేళ్ల క్రితం డీజిల్ ధర రూ.68 ఉన్నప్పుడు ఇతర కార్పొరేషన్లలో ధరల పెంచారని కర్ణాటక అధికారులు చెబుతున్నారు. డీజిల్ ధరల పెరుగుదల, కార్మికుల వేతన పెంపు, ఇతర ఆర్థిక అంశాలు ఈ కొత్త పెరుగుదలకు కారణమని కేఎస్‌ఆర్టీసీ చెబుతోంది.
(6 / 8)
కేఎస్ఆర్టీసీ బస్సుల టికెట్లను పరిశీలిస్తున్న మంత్రి అనిత.. కర్ణాటకలో బస్సుల్లో టిక్కెట్ల ధరలను 15 శాతం పెంచడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కర్ణాటక మంత్రి హెచ్కే పాటిల్ గురువారం ప్రకటించారు. పెరిగిన టికెట్ ధర 2025 జనవరి 5 నుంచి అమల్లోకి రానుంది. కార్పొరేషన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల కారణంగా ఛార్జీల పెంపు అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఎదుర్కొంటున్న లోటు కారణంగా ఈ 15 శాతం పెంచామని... ఈ పెంపుతో ప్రతి నెలా రూ.74.84 కోట్ల రాబడి వస్తుందని పాటిల్ వివరించారు.
(7 / 8)
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) బస్సుల టికెట్ ధరలను 15 శాతం పెంచడంపై కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్.అశోక రాష్ట్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ శనివారం (జనవరి 4l) రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టనుంది.
రవాణా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉందని, తమ వద్ద డబ్బులు లేవని సాకుతో ధరలు పెంచారని ఆరోపించారు. కర్ణాటకలో భార్యకు ఉచిత ప్రయాణం కానీ భర్తకు రెట్టింపు అని ఎద్దేవా చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏపీ మంత్రులు శుక్రవారం అక్కడ పర్యటిస్తున్నారుర.
(8 / 8)
కర్ణాటకలో 15 శాతం బస్సు ఛార్జీల పెంపుతో నెలకు రూ.74.85 కోట్లు, ఏడాదికి సుమారు రూ.784 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే రాష్ట్ర ప్రతిష్టాత్మక శక్తి పథకం ఆర్థిక భారాన్ని పాక్షికంగా పూడ్చడమే ఈ సవరణ లక్ష్యమని కేఎస్ ఆర్టీసీ చెబుతోంది. గత ఏడాది ప్రారంభించిన శక్తి పథకానికి నెలకు సుమారు రూ.417 కోట్లు ఖర్చవుతుండగా, ఒక్కో కార్పొరేషన్ కు రూ.104 కోట్లు కేటాయించారు. ఏపీలో కూడా ఈ పథకాన్ని అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.
ఇతర గ్యాలరీలు