(1 / 6)
పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ లోని పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్(స్వర్ణ దేవాలయం)ను మంత్రి నారా లోకేశ్ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్నారు.
(2 / 6)
"అమృత్ సర్ లోని హర్మందిర్ సాహిబ్ ను సందర్శించే అదృష్టం కలిగింది. అందరికీ శాంతి, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థించాను. స్వర్ణ దేవాలయం దైవిక ప్రశాంతత నిజంగా స్ఫూర్తిదాయకం. వాహెగురు ఆశీస్సులు మనందరికీ మార్గనిర్దేశం చేస్తాయి" అని నారా లోకేశ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
(3 / 6)
అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ ప్రత్యేక పూజలు చేశారు.
(5 / 6)
మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 21న కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇతర గ్యాలరీలు