AP Medical Jobs : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో 26,263 ఖాళీలు-ముందుగా ఏడెనిమిది వేల పోస్టుల భర్తీ!
AP Medical Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బోధనాసుపత్రుల్లో 1,484 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
(1 / 6)
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో వైద్యులు, పారా మెడికల్ పోస్టుల ఖాళీలే సుమారు 25.97 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 1,01,125 ఉద్యోగాలలో 3114 వైద్యులు, 23149 పారామెడికల్ ఉద్యోగ ఖాళీల ఉన్నట్లు వైద్య ఆరోగ్య పేర్కొంది.
(2 / 6)
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. డీఎంఈ, డీఎస్‌హెచ్, డీహెచ్, ఆయుష్, జాతీయ ఆరోగ్యమిషన్‌లలో ఖాళీల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ సేకరించింది. ఈ ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. వీటిలో అవసరానికి అనుగుణంగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
(3 / 6)
మొత్తం ఖాళీల్లో ప్రాధాన్యత క్రమం మేరకు ముందుగా ఏడెనిమిది వేల పోస్టుల భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖలో భాగంగా ఉన్న ఆయుష్ కింద ఆయుర్వేద, హోమియో, యునాని ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి.
(4 / 6)
ఆయుష్ విభాగంలో మొత్తం 825 వైద్యుల పోస్టులకు 407 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అటెండర్లు, కాంపౌండర్లు, ఇతర పోస్టులు కలిపి మొత్తం 1601 ఉద్యోగాల్లో... 1131 ఖాళీలు ఉన్నాయి.
(5 / 6)
రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ వైద్యుల సేవలకు మొత్తం 5,749 వైద్యుల పోస్టుల మంజూరు అయ్యాయి. వీటిలో 1,484 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజయవాడ జీజీహెచ్‌లోనే 46 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు