AP Registration Charges : భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ఏపీ ప్రభుత్వం కసరత్తు, అమరావతికి మినహాయింపు!
AP Registration Charges : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
(1 / 6)
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
(2 / 6)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై చర్చ జరుగుతుంది. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టత ఇస్తూ..ఫిబ్రవరి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలవుతాయని చెప్పారు.
(3 / 6)
అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ బుక్ విలువ మధ్య ఎక్కువ తేడా ఉందని ప్రభుత్వం గుర్తించింది.
(4 / 6)
రిజిస్ట్రేషన్ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సమాచారం. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, ఇతర అవసరాల కోసం అభివృద్ధి చేసేందుకు నిబంధనలు సులభతరం చేయనున్నారు.
(5 / 6)
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుపై త్వరలో సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారుల కసరత్తు పూర్తికాకపోతే ఛార్జీల పెంపు మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.
(6 / 6)
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. ఇందులో మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే చోట సగటున 0 శాతం నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుంది. పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గే అవకాశం కూడా ఉంది.
ఇతర గ్యాలరీలు