'తల్లికి వందనం స్కీమ్'కు ఆధార్ లింకింగ్ తప్పనిసరి...! NPCI ప్రాసెస్ ఇలా చేసుకోండి-ap govt thalliki vandanam scheme updates how to complete npci linking process and status check ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'తల్లికి వందనం స్కీమ్'కు ఆధార్ లింకింగ్ తప్పనిసరి...! Npci ప్రాసెస్ ఇలా చేసుకోండి

'తల్లికి వందనం స్కీమ్'కు ఆధార్ లింకింగ్ తప్పనిసరి...! NPCI ప్రాసెస్ ఇలా చేసుకోండి

Published Jun 05, 2025 10:41 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 05, 2025 10:41 AM IST

ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ జూన్ నెలలోనే ప్రారంభించనుంది. ఈ స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాల్సి ఉంది. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి…

(1 / 6)

లబ్దిదారుల ఆధార్ నెంబర్ లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాకు మాత్రమే సంక్షేమ పథకాల డబ్బులను ప్రభుత్వం బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్దిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సిలిండర్ నగదు జమ చేస్తుంది. ఇందుకోసం బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ(ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్) లింక్ చేసుకోవాలని సూచించింది. ఎన్పీసీఐ లింక్ ఉన్న వారికే నగదు జమ అవుతుంది. ఇదే మాదిరిగా తల్లికి వందనం స్కీమ్ లోనూ లింకింగ్ ప్రాసెస్ ను తప్పనిసరి చేస్తోంది.

(2 / 6)

బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్(NPCI) చేయించేందుకు లబ్దిదారులు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్ లోనే చేసుకోవచ్చు. ఇందుకోసం ఖాతాదారులు ముందుగా NPCI అధికారిక వెబ్ సైట్ https://www.npci.org.in/  లోకి వెళ్లాలి.హోమ్ పేజీలో 'Consumer' ఆప్షన్ పై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే పై స్టేటస్ బార్ లో మీకు 'Bharat Aadhar Seeding Enabler(BASE)' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ నొక్కాలి.

(3 / 6)

ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి "Seeding" ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఇప్పటి వరకు NPCI లింక్ లేని వారికి 'Fresh Seeding' ఆప్షన్ ఎంచుకుని బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసి, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి ఎన్పీసీఐ లింక్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. సబ్మిట్ చేసిన 24 గంటలలోపు ఎన్పీసీఐ లింక్ అవుతుంది.

(4 / 6)

ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అలాగే ఈ లింక్ లో ఉన్న బ్యాంకులకు మాత్రమే ఎన్పీసీఐ రిక్వెస్ట్ పంపేందుకు అవకాశం ఉంటుంది. NPCI లింక్ చేసుకునేందుకు కొన్ని బ్యాంకుల పేర్లు ఈ వెబ్సైట్ లో రావడం లేదు. అలాంటి వారు నేరుగా బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా ఎన్పీసీఐ లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. https://base.npci.org.in/base/homepage   లింక్ పై క్లిక్ చేసి స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.

(5 / 6)

మరోవైపు లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. ఈ స్కీమ్ కు సంబంధించి రేపోమాపో అధికారికంగా ప్రకటన వెలువడనుంది.

(6 / 6)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు