(1 / 7)
ఏపీలో తల్లికి వందనం స్కీమ్ డబ్బులు జమవుతున్నాయి. అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో వీటిని జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ. 15 వేలు ఇస్తుండగా… వీటిలో రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మరో రూ. 2 వేలు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి.
(2 / 7)
ఈ స్కీమ్ కు సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అర్హుల జాబితాలో పేరు ఉండి కూాడా పలువురి ఖాతాలోకి డబ్బులు పడలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఇలాంటి వారి నుంచి ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్ ను కూడా ప్రకటించింది.
(3 / 7)
తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి… ఇంకా అమౌంట్ క్రెడిట్ కానివారు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. స్థానికంగా ఉండే సచివాలయం కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది.
(4 / 7)
డబ్బులు పడనివారు… జూన్ 20వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాలి. ఇలాంటి అప్లికేషన్లను జూన్ 21వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. జూన్ 30వ తేదీన అర్హుల జాబితాలను ప్రదర్శిస్తారు. జూలై 5వ తేదీలోపు అర్హుల వివరాలను సరి చేసి నగదును జమ చేస్తారు.
(5 / 7)
ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.
(6 / 7)
తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ ను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత విద్యా సంవత్సరం (2025- 26) ఎంచుకోవాలి. ఆపై తల్లి ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. క్యాప్చా కోడ్ ను ఎంట్రీ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. లింకింగ్ ఉన్న నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ను ఎంట్రీ చేస్తే….మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.
(7 / 7)
ముందుగా ప్రాథమిక వివరాలు కనిపిస్తాయి. ఇందులో జిల్లా, మండలం, క్లస్టర్ పేరు, లబ్ధిదారు పేరు వంటి వివరాలను డిస్ ప్లే అవుతాయి. ఆ తర్వాత మీ అప్లికేషన్ వివరాలను కనిపిస్తాయి.ఇక చివరల్లో పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. మీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయా లేదా అనేది కనిపిస్తుంది. జమ కాకుండా ఉంటే కూడా ఆ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
ఇతర గ్యాలరీలు