(1 / 6)
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ, పశు వైద్య విద్యార్థుల ఉపకార వేతనాలు రూ. 10,000లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే పీజీ విద్యార్థుల ఉపకార వేతనాలు రూ.12000కు పెంచింది.
(2 / 6)
వ్యవసాయ, పశు వైద్య విద్యార్థుల స్కాలర్ షిప్ రూ.7,000 నుంచి పదివేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ యూనివర్సిటీలలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు.
(3 / 6)
విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో భోజనం అందించాలని నిర్ణయించింది.
(4 / 6)
ఇటీవల కేబినెట్ సమావేశంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ ప్రతిపాదనకు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకరిస్తామని తెలిపారు.
(5 / 6)
ప్రభుత్వ విద్యార్థులకు ఇష్టమైన మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(6 / 6)
బియ్యం బాగాలేవనే కారణంతో చాలా మంది విద్యా్ర్థులు మధ్యాహ్న భోజనం తినకుండా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం అందించాలని నిర్ణయించింది.
ఇతర గ్యాలరీలు