AP Lands Registration Charges : ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, డిసెంబర్ 1 ను అమల్లోకి!
AP Lands Registration Charges : ఏపీలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు 10 నుచి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. స్టాంపు పేపర్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.
(1 / 6)
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. సాధారణంగా పట్టణాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకొకసారి రిజిస్ట్రేషన్ విలువలు సవరిస్తుంటారు. తాజాగా కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేయాలని నిర్ణయించింది.
(2 / 6)
భూముల బహిరంగ మార్కెట్ విలువ, స్థానిక అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతూ ఉంటుంది. వైసీపీ హయాంలో కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెంచారు.
(3 / 6)
కూటమి సర్కార్... జాయింట్ కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి రిజిస్ట్రేషన్ విలువలపై గత రెండున్నర నెలల నుంచి వివరాలు సేకరిస్తోంది. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ ఈ కమిటీ పరిశీలనలు, రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై కసరత్తు చేస్తున్నారు. విలువల పెంపు, తగ్గింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
(4 / 6)
కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు 10 నుచి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. స్థానిక అంశాలు ఆధారంగా ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలు ఎక్కువగా ఉంటే తగ్గించే ఛాన్స్ ఉంది. నేషనల్ హైవేలు, గ్రోత్ కారిడార్‌లు, ఇతర అంశాల ప్రతిపాదికన భూముల రిజిస్ట్రేషన్ విలువలు ఖరారు చేయనున్నారు.
(5 / 6)
2023-24లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ తో రూ.10 వేల కోట్ల ఆదాయం రాగా... ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు రూ.5 వేల కోట్ల ఆదాయం వచ్చిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రెండువారాల్లో అధికారిక సమావేశం జరగబోతుందని, ఆ సమావేశంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు.
(6 / 6)
సబ్ రిజిస్ట్రాన్ ఆఫీసుల్లో స్టాంపు పేపర్లను అందుబాటులోకి తీసుకోస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ-స్టాంప్ పేపర్ తో పాటు ఫిజికల్ స్టాంపుపేపర్ల ద్వారా రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తామన్నారు. రూ.50, రూ.100 స్టాంపు పేపర్లు 10 లక్షలు చొప్పున ప్రతి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులకు పంపుతున్నామన్నారు.
ఇతర గ్యాలరీలు