AP Buildings Permission : భవన నిర్మాణాల అనుమతులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, అధికారాలు మున్సిపాలిటీలకు బదలాయింపు
AP Buildings Permission : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు అధికారాలు బదలాయింపు చేసింది.
(1 / 6)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది.
(2 / 6)
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల అధికారాలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు బదలాయింపు చేసింది ప్రభుత్వం.
(3 / 6)
పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రస్తుత నిబంధనలను సవరించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై రాష్ట్రంలో అన్ని రకాల భవనాలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతులు జారీచేయనున్నాయి.
(4 / 6)
నగర పంచాయతీలలో మూడెకరాల దాటితే డీటీసీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. గ్రామాల్లో 300 చ.మీ, 10 మీటర్ల ఎత్తు వరకూ భవన నిర్మాణాలకు పంచాయతీలు అనుమతులు మంజూరు చేస్తాయి.
(5 / 6)
అదే విధంగా అనధికారిక కట్టడాలపై మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలు చర్యలు తీసుకునేందుకు అధికారాలను బదలాయింపు చేసినట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
(6 / 6)
ఏపీలో భవన నిర్మాణాలు, లే ఔట్ల అనుమతుల జారీలో నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ - 2017లో సవరణలు చేసింది. లే అవుట్లలో వేసే రోడ్లకు గతంలో ఉన్న 12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ చేశారు. 500 చ.మీ.పైబడిన స్థలాల్లో చేపట్టే నిర్మాణాల్లో సెల్లారుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇతర గ్యాలరీలు