తెలుగు న్యూస్ / ఫోటో /
AP Govt Exgratia : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం- ప్రకృతి విపత్తుల మరణాలకు ఎక్స్ గ్రేషియా పెంపు
AP Govt Exgratia : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్ గ్రేషియా పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ కాలల్లో సంభవించే ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలకు పెంచాలచి నిర్ణయించింది.
(1 / 6)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్ గ్రేషియా పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ కాలల్లో సంభవించే ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలకు పెంచాలచి నిర్ణయించింది.
(2 / 6)
ఏపీ ప్రభుత్వ తాజా ఉత్తర్వులు ప్రకారం.. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచారు. దీంతో పాటు చేనేత, చేతివృత్తుల వారు ముంపు బారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు ప్రభుత్వం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
(3 / 6)
వరద ముంపు వల్ల నష్టపోయిన కటుంబాల ద్విచక్ర వాహనాలకు రూ.3 వేలు, ఆటోలకు రూ.10 వేలు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(4 / 6)
ప్రకృతి విపత్తుల కారణంగా మనిషి చనిపోతే రూ.5 లక్షలు, ఆవులు, గేదెల మృతి చెందితే రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, గొర్రెలు, మేకలకు రూ.7,500, కోడికి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. పశువుల పాక దెబ్బతింటే రూ.5 వేలు ఇస్తారు. ముంపునకు గురైన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు రూ.10 వేలు, కిరాణా షాపులు, రెస్టారెంట్లు, ఇతర షాపులకు రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
(5 / 6)
ముంపు కారణంగా వరి, పత్తి, వేరుశనగ, చెరకు పంటలు నష్టపోతే హెక్టారుకు రూ.25 వేలు, రాగులు, మినుము, సజ్జ, కొర్రలు, సామలు, ఆముదం, జూట్, నువ్వులు, పెసర, కంది, సోయా, సన్‌ఫ్లవర్, పొగాకు, మొక్కజొన్న పంటలకు రూ.15 వేలు పరిహారం చెల్లిస్తారు. మిర్చి పంట హెక్టారుకు రూ.35 వేలు, టమాటా, బొప్పాయి, పుచ్చ, పువ్వులు, నర్సరీలకు రూ.25 వేలు, పండ్ల తోటలకు రూ.35 వేలు, ఆయిల్ పామ్, కొబ్బరి చెట్టుకు రూ.1,500 చొప్పున విపత్తుల పరిహారం అందించనున్నారు.
ఇతర గ్యాలరీలు