Injection For Heart Attack Patients : రూ.45 వేలు ఖరీదైన గుండెపోటు ఇంజెక్షన్ ఉచితంగా, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
Injection For Heart Attack Patients : గుండెపోటుకు గురైన పేషంట్ ను పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు, అతని ప్రాణం నిలిపేందుకు మొదటి గంటలోపే 'టెనెక్టెప్లేస్' అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఖరీదు రూ.40 నుంచి 45 వేలు ఉంటుంది. ప్రభుత్వం ఈ ఇంజక్షన్ ను ఉచితంగా ఇస్తుంది.
(1 / 6)
ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ముఖ్యంగా కరోనా అనంతరం హార్ట్ ఎటాక్స్ ఎక్కువయ్యాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెపోటుకు గురైన మొదటి గంట ఎంతో కీలకం. గోల్డెన్ అవర్ గా పరిగణించే ఈ సమయంలో రోగికి సరైన వైద్యం అందాలి.
(2 / 6)
గోల్డెన్ అవర్ లో వ్యక్తి ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు ఓ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ పేరు టెనెక్టెప్లేస్. దీని ఖరీరు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్ ను పేదలు కొనుగోలు చేయలేక ప్రాణాలు విడిచిన సందర్భాలు లేకపోలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంజెక్షన్ ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.
(3 / 6)
గుండెపోటుకు గురైన పేషంట్ ను పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు, అతని ప్రాణం నిలిపేందుకు మొదటి గంటలోపే 'టెనెక్టెప్లేస్' అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది రూ.40 నుంచి 45 వేలు ఉంటుంది. పేదలకు అప్పటికప్పుడు ఇంత మొత్తం సమకూర్చుకోవడం అసాధ్యం. అందుకని ప్రభుత్వం ఈ ఇంజక్షన్ ను ఉచితంగా ఇస్తుంది.
(4 / 6)
జిల్లా ప్రధాన వైద్యశాలలతో పాటు ప్రాంతీయ వైద్య ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
(5 / 6)
ఈ వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో టెలీ సెంటర్లను గతంలో ప్రారంభించింది. వీటిని ఏరియా, సీహెచ్‌సీ, జిల్లా వైద్యశాలలకు అనుసంధానం చేశారు.
ఇతర గ్యాలరీలు