AP Liquor Shops : మందుబాబులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్-వైన్ షాపుల టైమింగ్స్ పొడిగింపు, ఎప్పటి నుంచంటే?-ap govt decided to bring new liquor policy private parties run shops timings extended ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Liquor Shops : మందుబాబులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్-వైన్ షాపుల టైమింగ్స్ పొడిగింపు, ఎప్పటి నుంచంటే?

AP Liquor Shops : మందుబాబులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్-వైన్ షాపుల టైమింగ్స్ పొడిగింపు, ఎప్పటి నుంచంటే?

Sep 18, 2024, 07:17 PM IST Bandaru Satyaprasad
Sep 18, 2024, 07:17 PM , IST

  • AP Liquor Shops : ఏపీ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తున్నట్లు తెలిపింది. వైన్ షాపుల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్ణయించారు. కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయించనున్నారు.

ఏపీ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారిధి వెల్లడించారు. అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెస్తామని  తెలిపారు. 

(1 / 6)

నూతన మద్యం షాపులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి లైసెన్స్‌లు కేటాయించనున్నారు. కొత్త మద్యం షాపులకు దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. ఇది తిరిగి చెల్లించరు. కొత్త షాపులకు రెండేళ్ల కాలపరిమితితో లైసెన్సులు జారీ చేస్తారు. 

(2 / 6)

వైన్ షాపుల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్ణయించారు. కొత్త విధానంలో ఈ పనివేళలు అమల్లోకి రానున్నాయి. గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 వరకు లిక్కర్ విక్రయించేవారు. కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయించనున్నారు. లక్కీ డ్రా విధానంలో వైన్ షాపులను కేటాయిస్తారు. షాపు యజమానికి 20 శాతం లాభం ఉంటుంది. జనాభాను బట్టి మద్యం షాపుల సంఖ్య నిర్ణయిస్తారు. 

(3 / 6)

వైన్ షాపుల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్ణయించారు. కొత్త విధానంలో ఈ పనివేళలు అమల్లోకి రానున్నాయి. గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 వరకు లిక్కర్ విక్రయించేవారు. కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయించనున్నారు. లక్కీ డ్రా విధానంలో వైన్ షాపులను కేటాయిస్తారు. షాపు యజమానికి 20 శాతం లాభం ఉంటుంది. జనాభాను బట్టి మద్యం షాపుల సంఖ్య నిర్ణయిస్తారు. (Image source: https://istockphoto.com)

రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రీమియమ్‌ లిక్కర్‌ షాపుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియమ్ షాపులకు కోటి రూపాయలను ఫీజుగా నిర్ణయించారు. ఈ షాపులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.15 లక్షలు ఫీజు చెల్లించారు. ఇది తిరిగి ఇవ్వరు. 

(4 / 6)

నూతన మద్యం విధానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న దుకాణాల్లో 10 శాతం గీతా కులాలకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. రిజర్వుడ్ షాపులకు ప్రత్యేక మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేయనుంది.  అన్ రిజర్వ్ డ్ షాపులకు ప్రతిపాదిత శ్లాబుల్లో 50 శాతం లైసెన్స్ ఫీజు ఉంటుంది. 

(5 / 6)

రాష్ట్రంలోని 3,736 దుకాణాల్లో  గీత కులాలకు 10% దుకాణాలను అంటే 340 దుకాణాలను కేటాయించనున్నారు.  రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా ఉండేందుకు లాటరీ ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు జరగనుంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి రానున్నారు. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు