సర్వే డేటా ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక..! 'తల్లికి వందనం స్కీమ్'పై కొత్త అప్డేట్ ఇదే-ap government working on implementation of thalliki vandanam scheme 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సర్వే డేటా ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక..! 'తల్లికి వందనం స్కీమ్'పై కొత్త అప్డేట్ ఇదే

సర్వే డేటా ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక..! 'తల్లికి వందనం స్కీమ్'పై కొత్త అప్డేట్ ఇదే

Published Jun 11, 2025 02:48 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 11, 2025 02:48 PM IST

‘తల్లికి వందనం’ స్కీమ్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. ఈ నెలలోనే పథకాన్ని ప్రారంభించనుంది. అయితే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తోంది. ఇందుకోసం అవసరమైన డేటాను పరిశీలిస్తోంది. తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి……

ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తల్లికి వందనం స్కీమ్ ను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెలలోనే స్కీమ్ ను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియపై పకడ్బందీగా వ్యవహారిస్తోంది.

(1 / 7)

ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు. తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.

(2 / 7)

తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు వారి పిల్లల వివరాలను పక్కాగా సేకరిస్తోంది.

(3 / 7)

పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న పిల్లల వివరాల డేటాను నిశ్చితంగా పరిశీలిస్తోంది. అంతేకాకుండా  గ్రామ, వార్డు సచివాలయ శాఖ వద్ద ఉన్న డేటాతో అనుసంధానం చేసి పరిశీలన చేయిస్తోంది. ఇంటింటి సర్వే డేటా ఆధారంగా తల్లికి వందనం స్కీమ్ లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

(4 / 7)

ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని సూచించింది. ఇదే విషయాన్ని అధికారులు చెబుతున్నారు.

(5 / 7)

ఈకైవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుండా డబ్బుల చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. తల్లులతో పాటు వారి పిల్లల వివరాలన్నీ కూడా హౌస్ డేటా బేస్ లో తప్పకుండా నమోదు చేసుకొని ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

(6 / 7)

కసరత్తు పూర్తి కాగానే స్కీమ్ ప్రారంభ తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శిస్తుంది. ఈ స్కీమ్ కు సంబంధించి ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ స్కీమ్ కోసం తల్లులు, విద్యార్థులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు