AP Pensions : 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన-ap government plans pension at 50 age key announcement by minister kondapalli srinivas ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Pensions : 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన

AP Pensions : 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన

Published Mar 18, 2025 05:22 PM IST Bandaru Satyaprasad
Published Mar 18, 2025 05:22 PM IST

AP Pensions : రాష్ట్రంలో పెన్షనర్ల తగ్గింపుపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో పెన్షనర్ల తగ్గింపుపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. 

(1 / 6)

మే నెల పెన్షన్లు నేవైసీపీ ప్రభుత్వం రూ.1000 పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం రాగానే రూ. వెయ్యి పెంచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.  ప్రస్తుతం పెన్షనర్లలో అనర్హులను తొలగిస్తున్నామన్నారు. 

(2 / 6)

50 ఏళ్లు పైబడిన, అర్హత ఉన్న చేనేత కార్మికులకు పెన్షన్ పంపిణీ జరుగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వితంతువులు, వికలాంగులు ఇలా అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. దీనిపై తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరారు.  

(3 / 6)

"50 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులకు ప్రస్తుతం పెన్షన్ ఇస్తున్నాం. 18 పైబడిన వితంతువులకు పెన్షన్ అందిస్తున్నాం. అలాగే అన్ని వయసుల దివ్యాంగులందరికీ పెన్షన్ అందిస్తున్నాం. ఆదివాసీలకు 50 ఏళ్లకే పెన్షన్ పథకాన్ని 2014లోనే టీడీపీ ప్రభుత్వం ప్రారభించింది" - మంత్రి కొండపల్లి శ్రీనివాస్  

(4 / 6)

"కూటమి అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. కానీ పెన్షన్లు తగ్గిస్తున్నారు" అని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ ఆరోపించారు. "జగన్ సీఎం అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్లు ఉంటే, కూటమి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పెన్షన్లు తొలగించారు?" అని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రశ్నించారు. 

(5 / 6)

వైసీపీ ఎమ్మెల్సీలు అడిగి ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్...ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తొలిసారి పెన్షన్లు మొదలుపెట్టారన్నారు. 2014లో పెన్షన్ వెయ్యి నుంచి రెండు వేలకు టీడీపీ సర్కారే పెంచిందన్నారు. వృద్ధాప్య పెన్షన్లతో పాటు మత్స్యకార, ట్రాన్స్ జెండర్ పింఛన్లు కూడా ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ కేవలం కాలం చేసిన వారి పెన్షన్లు మాత్రమే తొలగించామన్నారు.  

(6 / 6)

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు