తెలుగు న్యూస్ / ఫోటో /
AP Govt Job Calender 2025 : ఉద్యోగాల భర్తీకి 'జాబ్ క్యాలెండర్' - ఏపీ సర్కార్ కసరత్తు, ఈనెలలోనే ప్రకటన..!
- AP Govt Job Calender 2025 : ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ‘జాబ్ క్యాలెండర్’ను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ఏపీపీఎస్సీ ద్వారా వివరాలను ప్రకటించాలని యోచిస్తోంది. ఇందుకు ఈనెల 12వ తేదీని ముహుర్తంగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
- AP Govt Job Calender 2025 : ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ‘జాబ్ క్యాలెండర్’ను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ఏపీపీఎస్సీ ద్వారా వివరాలను ప్రకటించాలని యోచిస్తోంది. ఇందుకు ఈనెల 12వ తేదీని ముహుర్తంగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
(1 / 7)
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. నిర్దిష్ట సమయంలో ఖాళీలను పూరించేలా కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ముందస్తుగానే ఖాళీలను గుర్తించి రిక్రూట్ చేసేలా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.
(2 / 7)
ఏపీ ప్రభుత్వం విడుదల చేసే జాబ్ క్యాలెండర్ ను ఏపీపీఎస్సీ ద్వారా ప్రకటించనుంది. అయితే ఇందుకు జనవరి 12వ తేదీని ముహుర్తంగా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. అంతకంటేముందే ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
(3 / 7)
జనవరి 12వ తేదీనే కొత్త నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా… నోటిఫికేషన్ జారీ అయిన వాటి పరీక్ష తేదీలను కూడా ప్రకటించనున్నారు. దాదాపు 18 - 20 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం.
(4 / 7)
కొత్తగా జారీ చేయబోయే నోటిఫికేషన్ల ద్వారా 850కిపైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే వీటిలో అత్యధికంగా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఉన్నాయి. ఇక ఏప్రిల్ తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను కూడా నిర్వహించనున్నారు.
(5 / 7)
ఆయా శాఖాల్లో ఖాళీల వివరాలను ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు రాగానే… జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.
(6 / 7)
ఈనెలలో ప్రకటించే జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా… వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్ష తేదీలను కూడా ఖరారు చేయనున్నారు. అయితే ఈ ఏడాది మార్చి నుంచి రాత పరీక్షల తేదీలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు