AP New Airports : ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు - ఈ ప్రాంతాలకు ఇక మహర్దశ..! ఎక్కడెక్కడంటే..?-ap government has decided to build seven more airports ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap New Airports : ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు - ఈ ప్రాంతాలకు ఇక మహర్దశ..! ఎక్కడెక్కడంటే..?

AP New Airports : ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు - ఈ ప్రాంతాలకు ఇక మహర్దశ..! ఎక్కడెక్కడంటే..?

Jan 04, 2025, 09:05 AM IST Maheshwaram Mahendra Chary
Jan 04, 2025, 09:05 AM , IST

  • New Airports in Andhrapradesh : ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వీటి నిర్మాణంపై తాజాగా సమీక్షించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధిపై ఉండవల్లిలోని తన నివాసంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.  ఇందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో పాటు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

(1 / 6)

ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 

(2 / 6)

కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 

(3 / 6)

(image source unsplash.com)

ప్రతిపాదిస్తున్న ఏడు విమానాశ్రయాల్లో… కొన్నింటిలో ఇప్పటికే కొంతమేర భూసేకరణ జరిగిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో దగదర్తిలో విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించామని…. 635 ఎకరాల భూమిని కూడా సేకరించామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదన ఆగిపోయిందని… ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కిస్తామన్నారు. మిగిలిన భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు.

(4 / 6)

ప్రతిపాదిస్తున్న ఏడు విమానాశ్రయాల్లో… కొన్నింటిలో ఇప్పటికే కొంతమేర భూసేకరణ జరిగిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో దగదర్తిలో విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని 

నిర్ణయించామని…. 635 ఎకరాల భూమిని కూడా సేకరించామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదన ఆగిపోయిందని… ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కిస్తామన్నారు. మిగిలిన భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు.

(image source unsplash.com)

పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాల్లో ఎయిర్ పోర్టును నిర్మించాలని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా…  తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల్లో నిర్మించాలని చూస్తున్నట్లు వివరించారు. 

(5 / 6)

ఇక సీఎం చంద్రబాబు ప్రాతనిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా ఎయిర్ పోర్టు రానుంది. ఇక్కడ రెండు దశల్లో ఇప్పటికే భూసేకరణ జరగనుంది.  మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాల భూమిని సేకించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇక్కడ నిర్మాణ పనుల గురించి.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఇక గన్నవరం ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్‌ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో రూపొందించిన డిజైన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఎయిర్ పోర్టులపై ఫోకస్ పెట్టడంతో ఆ ప్రాంతాలకు త్వరలోనే మహర్దశ రావటం ఖాయంగా కనిపిస్తోంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు