మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఖాతాల్లో రూ.20 వేలు ఎప్పుడంటే?-ap government good news for fishermen 20k deposits in accounts on april 26th ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఖాతాల్లో రూ.20 వేలు ఎప్పుడంటే?

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఖాతాల్లో రూ.20 వేలు ఎప్పుడంటే?

Published Apr 15, 2025 07:40 PM IST Bandaru Satyaprasad
Published Apr 15, 2025 07:40 PM IST

ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో మత్స్యకార భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26న మత్స్యకార భరోసా పథకం కింద రూ.20 వేలు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో మత్స్యకార భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు.

(1 / 6)

వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.10 వేల నుంచి 20 వేలకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి నిమ్మల రామానాయుడు గుడ్ న్యూస్ చెప్పారు.  ఈ నెల 26న మత్స్యకారులకు రూ.20 వేల చొప్పున ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.

(2 / 6)

గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. వేట నిషేధ సమయంలో డబ్బులు ఖాతాల్లో జమ చేశారు.

(3 / 6)

సముద్రతీర ప్రాంతాల్లో నివాసించే మత్స్యకారులకు చేపలవేటపై ఆధారపడి జీవిస్తారు. అయితే ఏటా ఏప్రిల్ నుంచి జూన్‌ వరకూ సుమారు 61 రోజుల పాటు చేపల వేటపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధిస్తాయి. దీంతో ఈ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో  రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా పేరిట ఆర్థిక సాయం అందిస్తుంది.

(4 / 6)

ఎన్నికల సమయంలో రూ.10 వేల ఆర్థిక సాయాన్ని రూ.20 వేలకు పెంచుతామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ హామీ మేరకు ఏప్రిల్ 26న మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

(5 / 6)

ఏపీలో నేటి నుంచి(ఏప్రిల్ 15) జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. సముద్రంలో మత్స్య సంపదను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తున్నాయి. ఈ రెండు నెలల్లో  చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి కాబట్టి ఈ సమమంలో వేటను నిలిపివేస్తారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఇస్తారు.

(6 / 6)

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు