AP Farmer Registration : ఏపీ రైతులకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ పథకాలు పొందేందుకు వివరాలు నమోదు-ఏ పత్రాలు కావాలంటే?-ap farmer registration for govt scheme rythu seva center noting information ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Farmer Registration : ఏపీ రైతులకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ పథకాలు పొందేందుకు వివరాలు నమోదు-ఏ పత్రాలు కావాలంటే?

AP Farmer Registration : ఏపీ రైతులకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ పథకాలు పొందేందుకు వివరాలు నమోదు-ఏ పత్రాలు కావాలంటే?

Published Feb 08, 2025 06:10 PM IST Bandaru Satyaprasad
Published Feb 08, 2025 06:10 PM IST

AP Farmer Registration : రైతన్నలకు ఆధార్ కార్డుల తరహాలో 11 నెంబర్ల విశిష్ట సంఖ్య కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.  ఆధార్‌ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్, పట్టాదారు పాసుపుస్తకం తీసుకుని గ్రామంలో రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తారు.

రైతన్నలకు ఆధార్ కార్డుల తరహాలో 11 నెంబర్ల విశిష్ట సంఖ్య కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. రైతు సేవా కేంద్రాల్లో 'ఫార్మర్ రిజిస్ట్రీ' పేరుతో రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా కర్నూలు, నంద్యాలలో ఏడుగురు రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమదు  చేసి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించారు. 

(1 / 6)

రైతు సేవా కేంద్రంలో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆధార్‌ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్, పట్టాదారు పాసుపుస్తకం తీసుకుని గ్రామంలో రైతు సేవా కేంద్రానికి వెళ్తే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తారు. రైతుల మొబైల్ కు మూడుసార్లు ఓటీపీ వస్తుంది. వీటిని నమోదు చేసిన తర్వాత 11 అంకెల ప్రత్యేక గుర్తింపు నెంబర్ వస్తుంది. గ్రామంలో అందుబాలో లేని రైతులు రైతు సేవా కేంద్రం సిబ్బందిని ఫోన్ లో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవచ్చు. 

(2 / 6)

ఆధార్, 1-బి అడంగల్‌లో రైతు పేరు సరిగ్గా ఉంటే వెంటనే 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. అడంగల్‌లో, ఆధార్‌లో రైతు పేరు 80 శాతం పోలితే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది. వివరాలు 60-80 శాతం మేరకే సరిపోలితే వీఆర్వో లాగిన్‌కు వెళ్తుంది. 

(3 / 6)

60 శాతానికంటే తక్కువగా రైతు పేరు వివరాలు సరిపోలని పరిస్థితి ఉంటే పరిశీలనకు తహసీల్దారు లాగిన్‌కు వెళ్తుంది. అధికారులు పరిశీలించి అంతా సరిగా ఉందని భావిస్తే రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. 

(4 / 6)

ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ఉద్యాన, మత్స్య రైతుల వివరాలు సేకరించనున్నారు. భవిష్యత్తులో కౌలు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, వ్యవసాయ అనుబంధ వృత్తిదారుల వివరాలు సేకరించే అవకాశం ఉంది. 

(5 / 6)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అమలు చేసే పథకాలు...పంటల బీమా, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ పరికరాలపై రాయితీ, పంట నష్టపరిహారం...నమోదు చేసుకున్న రైతులకు సులభంగా అందనున్నాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు