
(1 / 6)
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ ప్రవేశాలకు తొలివిడత కౌనెల్సింగ్ సీట్ల కేటాయింపు పూర్తైంది. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు జులై 22వ తేదీ లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ తో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో నమోదును పూర్తి చేయవలసి ఉందన్నారు.
(Pexels)
(2 / 6)
జులై 19 నుండే తరగతులు ప్రారంభం అవుతాయని కన్వీనర్ నవ్య వివరించారు. అర్హత పొందిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సిలింగ్ కోసం 1,28,619 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా ధ్రువీకరణ పత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు.

(3 / 6)
కోర్సుల ఎంపికలను 1,26,608 మంది పూర్తి చేసుకోగా, 44,69,203 ఎంపికలు నమోదు అయ్యాయని కన్వీనర్ పేర్కొన్నారు. కన్వీనర్ కోటా కింద 24 విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలల్లో 6877 సీట్లు ఉండగా, 6189 సీట్లు భర్తీ అయ్యాయన్నారు.

(4 / 6)
212 ప్రైవేట్ కళాశాలల్లో 1,21,951 సీట్లు ఉండగా, 1,03,247 భర్తీ అయ్యాయని, 9 ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 7832 సీట్లు ఉండగా, 7700 సీట్లు భర్తీ చేశామని ఏపీఈఏపీసెట్ కన్వీనర్ నవ్య తెలిపారు.

(5 / 6)
మొత్తంగా 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా, 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, 19,524 సీట్లు మలివిడత కౌన్సెలింగ్ కోసం ఉన్నాయని కన్వీనర్ డాక్టర్ నవ్య వివరించారు.
(Pexels)
(6 / 6)
ఎన్సీసీ సంచాలకులు, శాఫ్ ఎండీ నుంచి తుది మెరిట్ జాబితా ఇంకా రానందున క్రీడా కోటా, ఎన్సీసీ కోటా సీట్లను భర్తీ చేయలేదని తదుపరి దశలో వీటిని భర్తీ చేస్తామని కన్వీనర్ నవ్య స్పష్టం చేశారు.
ఇతర గ్యాలరీలు