(1 / 6)
ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ - 2025 నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

(2 / 6)
మార్చి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు.
(image source istockphoto.com)
(3 / 6)
రూ. 1000 ఫైన్ తో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ. 2వేల ఫైన్ తో మే 7 వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మే 6 నుంచి 8వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
(image source istockphoto.com)
(4 / 6)
ఇక రూ. 10 వేల ఫైన్ తో మే 16వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 12వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
(image source istockphoto.com)(5 / 6)
వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో రోజుకు రెండు విడతలుగా ఉంటుంది. ఇంజినీరింగ్ పరీక్ష మే 21 నుంచి 27 వరకు రోజుకు రెండు విడతలుగా నిర్వహిస్తారు.
(6 / 6)
వ్యవసాయ, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని మే 21న, ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ని మే 28న విడుదల చేస్తారు. తుది ‘కీ’ని జూన్ 5న ప్రకటిస్తారు. https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు