Pawan Kalyan Books : విజయవాడ బుక్ ఫెయిర్ లో పవన్ కల్యాణ్, రూ.10 లక్షలతో పుస్తకాలు కొనుగోలు-ap dy cm pawan kalyan visited vijayawada book fair buys 10 lakh worth of books ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan Books : విజయవాడ బుక్ ఫెయిర్ లో పవన్ కల్యాణ్, రూ.10 లక్షలతో పుస్తకాలు కొనుగోలు

Pawan Kalyan Books : విజయవాడ బుక్ ఫెయిర్ లో పవన్ కల్యాణ్, రూ.10 లక్షలతో పుస్తకాలు కొనుగోలు

Jan 11, 2025, 04:00 PM IST Bandaru Satyaprasad
Jan 11, 2025, 04:00 PM , IST

Pawan Kalyan Books : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ బుక్ ఫెయిర్ ను శనివారం సందర్శించారు. దాదాపు రెండున్నర గంటలపాటు పుస్తక కేంద్రాలకు వెళ్లి 10 లక్షల వ్యయంతో పుస్తకాలు కొనుగోలు చేశారు. ఈ పుస్తకాలతో పిఠాపురం నియోజకవర్గంలో అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఏపీ డిప్యూటీ సీఎం  పవన్ కల్యాణ్ విజయవాడ బుక్ ఫెయిర్ ను శనివారం సందర్శించారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశారు. బుక్ ఫెయిర్ లోని ప్రతి స్టాల్ లో పుస్తకాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. పలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలు పరిశీలించారు. 

(1 / 6)

పవన్ కల్యాణ్ బుక్ ఫెయిర్ కు వస్తున్నారన్న సమాచారం గోప్యంగా ఉంచారు అధికారులు. బుక్ ఫెయిర్ లో నిర్వాహకులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు.  రూ.10 లక్షలతో పుస్తకాలకు ఆర్డర్ చేశారు.  

(2 / 6)

ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల వరకూ పలువురి రచనలను పవన్ కల్యాణ్ కొనుగోలు చేశారు. అదే విధంగా ప్రాచీన సాహిత్యంపై వెలువరించిన విశ్లేషణలు, పరిశీలన పుస్తకాలను ఎంచుకున్నారు. వీటితో అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాతిక సంబంధిత రచనలు పరిశీలించి కొనుగోలు చేశారు. 

(3 / 6)

ఈ సందర్భంగా తనకు ఎంతో నచ్చిన ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకం చూసి పవన్ కల్యాణ్ ఎంతో సంతోషించారు. డా.విక్టర్ ఈ.ఫ్రాంకిల్ రాసిన ఈ పుస్తకం చదివితే నిరాశానిస్పృహలు అధిగమించి ఆశావాద భావన కలుగుతుందని చెప్పారు. 

(4 / 6)

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల నిర్బంధాల్లో ఉన్న ఫ్రాంకిల్ ఎలా భవిష్యత్ జీవితాన్ని నిలుపుకున్నాడో ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’  రచన తెలుపుతుందని చెబుతూ, బహుమతిగా ఇవ్వడానికి బాగుంటుందని ఎక్కువ సంఖ్యలో ఈ పుస్తకాలు కొనుగోలు చేశారు పవన్ కల్యాణ్. అదే విధంగా భారతీయ చట్టాలు, చరిత్ర, రాజకీయ, పబ్లిక్ పాలసీ, శాస్త్ర సాంకేతిక, వ్యవసాయ, వృక్ష, పర్యావరణ సంబంధిత పుస్తకాలపై పవన్ ప్రత్యేక ఆసక్తి చూపారు. 

(5 / 6)

పిఠాపురం నియోజకవర్గంలో అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆ గ్రంథాలయం కోసం పవన్ కల్యాణ్ పుస్తకాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.  ఈ నెల 2వ తేదీన పుస్తక మహోత్సవాన్ని పవన్ ప్రారంభించారు.  

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు