Pawan Kalyan Kumbh Mela: కుంభమేళాలో కుటుంబంతో పవన్ కల్యాణ్ పుణ్య స్నానాలు- భార్యతో సెల్ఫీ- వెంట స్టార్ డైరెక్టర్- ఫొటోలు
- Pawan Kalyan In Kumbh Mela With Family Photos: కంభమేళాలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుటుంబంతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్ ఉన్నారు.

(1 / 6)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుటుంబంతో కలిసి కుంభమేళాను దర్శించుకున్నారు. ప్రయాగ్ రాజ్‌లో భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వారికి హారతి అందించారు. వారితోపాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.
(All Pics @ Instagram)(2 / 6)
కుంభమేళాలోని ప్రయాగ్ రాజ్‌లో పవన్ కల్యాణ్ ఇలా హారతి అందించారు. ఇందులో పవన్ కల్యాణ్ కాషాయ కండువా కప్పుకుని, నుదుటి బొట్టు పెట్టుకుని కనిపించారు.
(3 / 6)
పుణ్య స్థానాలు చేసిన తర్వాత ఇలా నదిలో నీళ్లు వదిలారు పవన్ కల్యాణ్, ఆయన కుటుంబం. వారితోపాటు అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పక్కనే ఉన్నారు. పుణ్య స్నానాలు ఆచరించే సమయంలో పవన్ కల్యాణ్ పైన ఎలాంటి వస్త్రం ధరించకుండా కనిపించారు. అకీరా నందన్ బనియన్‌తో కండువా వేసుకుని స్తానం చేశాడు.
(4 / 6)
ప్రయాగ్ రాజ్‌లో పుణ్య స్నానం చేయాడనికి ముందుగా ఇలా పవన్ కల్యాణ్ నమస్కారం చేశారు. అనంతరం ఆయన సెక్యురిటీ సంరక్షణలో పుణ్య స్నానం చేశారు. ఒంటిమీద జంజిరంతో ఏపీ డిప్యూటీ సీఎం ఇలా కనిపించారు.
(5 / 6)
కుంభమేళాను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఇలా సెల్ఫీలు తీసుకున్నారు.
ఇతర గ్యాలరీలు