(1 / 7)
ఏపీలో 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను గతేడాది నిర్వహించి, తుది ఫలితాలు విడుదల చేశారు. వీరిలో 95,209 మంది ఫిజికల్ టెస్టులకు ఎంపిక అయ్యారు.
(2 / 7)
కానిస్టేబుల్ అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ ఈవెంట్లు రేపటి(డిసెంబర్ 30) నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది.
(3 / 7)
కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) 9441450639, 9100203323 ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ ను సంప్రదించాలని పోలీస్ అధికారులు తెలిపారు.
(4 / 7)
దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. అభ్యర్థులు తమతో పాటుగా అధికారులు తెలిపిన ఒరిజినల్ సర్టిఫికెట్ లతో పాటు ఒక సెట్ అటెస్టడ్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా సమర్పించాల్సిందిగా సూచించారు.
ఒరిజినల్ సర్టిఫికట్ లు లేని పక్షంలో దేహదారుఢ్య ఈవెంట్లకు అనుమతించమని తెలిపారు.
(5 / 7)
కానిస్టేబుల్ అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు
1) అభ్యర్థుల ఎస్ఎస్సీ, ఇంటర్ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ లు
2) డిగ్రీ మార్క్స్ లిస్ట్, ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సెర్టిఫికేట్
3) ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, కమ్యునిటీ సర్టిఫికెట్(6 నెలలలోపు తీసుకుని ఉండాలి).
4) BC అభ్యర్థులు క్రిమి లేయర్ సెర్టిఫికెట్లను తప్పకుండ తీసుకుని రావాలి(నోటిఫికేషన్ విడుదల తేదీ తరువాత మాత్రమే తీసుకోవాలి).
5) 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
(6 / 7)
6) ఒరిజినల్ NCC, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సెర్టిఫికేట్ లు ఏ, బి, సి సర్టిఫికెట్స్, సర్వీస్ సర్టిఫికెట్లు.
7) ఒరిజినల్ ట్రైబ్ సర్టిఫికెట్లు/ ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్
8) తీవ్రవాదులు/సంఘ విద్రోహుల దాడిలో చనిపోయిన పోలీస్ సిబ్బంది పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్
9) చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ సర్టిఫికెట్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లోపు అధికారుల పిల్లలకు మాత్రమే).
10) ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్(సర్వీస్ బుక్ తో పాటు), మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్
11) కాల్ లెటర్ లో తెలిపిన స్కోరు కార్డ్ (ఒరిజినల్ రిజల్ట్)
12) స్టేజ్-1 అప్లికేషన్, స్టేజ్-II అప్లికేషన్ లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
(7 / 7)
కాల్ లెటర్ లో తెలిపిన తేదీ, సమయానికి మాత్రమే అభ్యర్థులు హాజరు కావాలని అధికారులు తెలిపారు. నిర్ణీత సమయానికి అభ్యర్థి హాజరు కాకపోతే అభ్యర్థులను మైదానంలోకి అనుమతించరు. అభ్యర్థి ఒక్కరికి మాత్రమే మైదానంలోకి అనుమతి ఉంటుంది. స్నేహితులు, బంధువులు కుటుంబ సభ్యులను అనుమతించరు.
ఇతర గ్యాలరీలు