CM Jagan Delhi Tour Pics : హస్తినలో ఏపీ ముఖ్యమంత్రి జగన్
cm ys jagan delhi tour updates: సీఎం జగన్ ఢిల్లీ టూర్ శుక్రవారంతో ముగిసింది. ఇవాళ ప్రధాని మోదీతో పాటు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
(1 / 5)
పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీతో శుక్రవారం సీఎం జగన్ భేటీ అయ్యారు. విభజన చట్టంలోని అంశాలు, పోలవరం ప్రాజెక్ట్, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు గురించి చర్చించారు.(twitter)
(3 / 5)
సీఎం జగన్ తో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ప్రధాననమంత్రి మోదీని కలిశారు. (twitter)
(4 / 5)
“రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి” అంటూ ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. (twitter)
(5 / 5)
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.(twitter)
ఇతర గ్యాలరీలు