(1 / 6)
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.
(2 / 6)
ఈ సమావేశంలో వృద్ధిరేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, రెండవ, మూడవ శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా… ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు.
(3 / 6)
స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పీ 4 ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామని అన్నారు. వికసిత్ భారత్ 2047 సాకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధి చేపడుతున్న కార్యక్రమాలను కూడా లేవనెత్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలో బయోమెడికల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఏపీ మార్గం వేస్తోందన్నారు.
(4 / 6)
(5 / 6)
(6 / 6)
ఇతర గ్యాలరీలు