CM Chandrababu in Hyderabad : ‘ఐటీ తిండి పెడుతుందా అని హేళన చేశారు’ - సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు-ap cm chandrababu participated in world telugu federation conference at hyderabad 2025 photos see here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cm Chandrababu In Hyderabad : ‘ఐటీ తిండి పెడుతుందా అని హేళన చేశారు’ - సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu in Hyderabad : ‘ఐటీ తిండి పెడుతుందా అని హేళన చేశారు’ - సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Published Jan 03, 2025 10:18 PM IST Maheshwaram Mahendra Chary
Published Jan 03, 2025 10:18 PM IST

  • CM Chandrababu in Hyderabad : అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు..శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటే అని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో మాట్లాడిన ఆయన.. నాలెడ్జ్ ఎకానమీ ఎప్పటికీ తెలుగు వారి సొంతమని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమాఖ్య ద్వైవార్షిక మహాసభలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

(1 / 6)

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు… తెలుగువారు ఎక్కడున్నా రాణిస్తున్నారని చెప్పారు. 1996లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని గుర్తు చేశారు. “ఐటీ తిండి పెడుతుందా అని అప్పట్లో ఎంతో మంది హేళన చేశారు… సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే.. ఏమన్నా ఉపయోగమా? అని ప్రశ్నించారు. కానీ ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు దూసుకెళ్తున్నారు” అని వ్యాఖ్యానించారు.  

(2 / 6)

“తెలంగాణ, ఏపీ, ఆస్ట్రేలియా, అమెరికా.. ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చారు. వివిధ దేశాల సమాఖ్యల అధ్యక్షులు ఇక్కడకు వచ్చారు. నా జీవితంలో ఇది ఎంతో సంతోషకరమైన రోజు”అని చంద్రబాబు అన్నారు.

(3 / 6)

“ఏం చేయాలన్నా ఒక దూరదృష్టి ఉండాలి. ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. భవిష్యత్ లో జరగబోయే విషయాలను మనం ముందుగానే ఆలోచించాలి. తగిన విధంగా ముందుకు వెళ్లగలిగితే ఏదైనా సాధ్యమే. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. 25 సంవత్సరాల్లో ఇది సాధ్యమైంది”అని సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారు. 

(4 / 6)

“ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభమయ్యాయి. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు..శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటే.. అదే తెలుగుజాతి” అని చంద్రబాబు చెప్పారు.

(5 / 6)

ఈ సభలకు సీఎం చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి కూడా హాజరయ్యారు.

(6 / 6)

ఇతర గ్యాలరీలు