AP Pensions : పెన్షన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం, గ్రామ సభల ద్వారా పరిష్కారించాలని ఆదేశం-ap cabinet key decisions on pensions free sand policy ap govt gos released in online ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Pensions : పెన్షన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం, గ్రామ సభల ద్వారా పరిష్కారించాలని ఆదేశం

AP Pensions : పెన్షన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం, గ్రామ సభల ద్వారా పరిష్కారించాలని ఆదేశం

Published Oct 23, 2024 07:26 PM IST Bandaru Satyaprasad
Published Oct 23, 2024 07:26 PM IST

AP Pensions : వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

(1 / 6)

దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఉచిత సిలిండర్ల పథకానికి ఏటా రూ.2,700 కోట్ల వ్యయం అవుతుందని తెలిపింది. 

(2 / 6)

సొంత అవసరాలకు ఎడ్ల బండి, ట్రాక్టర్ల మీద ఇసుక తీసుకుని వెళ్లేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వంలో ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో పారదర్శకంగా ఇసుక పాలసీ తీసుకొచ్చామని మంత్రులు తెలిపారు. 108 ఇసుక రీచ్‌లను గుర్తించామన్నారు. ఎడ్ల బండి, ట్రాక్టర్ల మీద ఎవరైనా ఇసుక ఉచితంగా తీసుకెళ్లొచ్చన్నారు. సొంతానికి కాకుండా అమ్మకానికి తీసుకెళ్లే వారిపై మానిటరింగ్ ఉంటుందన్నారు. 

(3 / 6)

ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్ల ప్రభుత్వంపై రూ.264 కోట్లు భారం పడుతుంది. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రులు తెలిపారు. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

(4 / 6)

దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుంచి 17 వరకు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆలయ కమిటీల్లో సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. 

(5 / 6)

2021 నుంచి ఆన్ లైన్ పెట్టని జీవోలను ప్రజల ముందు ఉంచాల‌ని కేబినెట్ నిర్ణయించింది. 2021 నుంచి అన్ని జీవోలు వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

(6 / 6)

ఇతర గ్యాలరీలు