AP TG Weather Updates : ఏపీపై ఉపరితల ఆవర్తన ప్రభావం..! తెలంగాణలో ఆ తేదీ వరకు భారీ వర్షాలు..!
- AP Telangana Rain Updates : తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఓవైపు రుతుపవనాల విస్తరణతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వానలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Rain Updates : తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఓవైపు రుతుపవనాల విస్తరణతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వానలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
(1 / 7)
తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రుతుపవనాలు అన్ని ప్రాంతాలకు విస్తరించటంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(Image Source @APSDMA Twitter)(2 / 7)
సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కోస్తాంధ్రకు అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరిత అవర్తనం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతం మీదుగా కూడా విస్తరించింది ఉందని పేర్కొంది.
(Image Source @APSDMA Twitter)(3 / 7)
గోవా నుంచి దక్షిణ కోస్తా వరకు సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తులో తూర్పు - పడమర ద్రోణి బలహీనపడిందని ఐఎండీ ప్రకటించింది. తాజా వావరణపరిస్థితులతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(4 / 7)
ఏపీలో ఇవాళ(జూన్ 19) అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(Image Source @APSDMA Twitter)(5 / 7)
ఇక విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
(6 / 7)
తెలంగాణలో మరో నాలుగైదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల, ఉరుములతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గాలి వేగం గంటకు 30 - 40 కి.మీ వేగంతో ఉండొచ్చని అంచనా వేసింది.
ఇతర గ్యాలరీలు