(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. మరో నాలుగైదు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
(@APSDMA Twitter)(2 / 6)
ద్రోణి ప్రభావంతో ఇవాళ(జూన్ 22) ఏపీలోని అల్లూరి, ఏలూరు,విజయనగరం,మన్యం, అనకాపల్లి,కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,కర్నూలు, నంద్యాల, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(3 / 6)
తెలంగాణలో చూస్తే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(4 / 6)
ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫిబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గాలి వేగం గంటకు 30 -40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 6)
నేటి నుంచి జూన్ 25వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 26, 27 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
(@APSDMA Twitter)(6 / 6)
వచ్చే వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. విత్తనాలు వేసిన రైతులు… వానల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
(@APSDMA Twitter)ఇతర గ్యాలరీలు