AP TG Weather Updates : తీరం వెంబడి 'ద్రోణి' విస్తరణ - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు-ap and telangana likely to receive moderate to heavy rains for more days imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Weather Updates : తీరం వెంబడి 'ద్రోణి' విస్తరణ - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

AP TG Weather Updates : తీరం వెంబడి 'ద్రోణి' విస్తరణ - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

Jul 03, 2024, 10:39 AM IST Maheshwaram Mahendra Chary
Jul 03, 2024, 10:39 AM , IST

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది.

(1 / 7)

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది.(@APSDMA Twitter)

ద్రోణి ప్రభావంతో  ఇవాళ (బుధవారం) శ్రీకాకుళం,మన్యం,అల్లూరి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,తిరుపతి,విశాఖపట్నం,అనకాపల్లి,కృష్ణా  జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 

(2 / 7)

ద్రోణి ప్రభావంతో  ఇవాళ (బుధవారం) శ్రీకాకుళం,మన్యం,అల్లూరి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,తిరుపతి,విశాఖపట్నం,అనకాపల్లి,కృష్ణా  జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. (@APSDMA Twitter)

బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్ఆర్,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

(3 / 7)

బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్ఆర్,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.(@APSDMA Twitter)

ఏపీలో చూస్తే జులై 6వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది.

(4 / 7)

ఏపీలో చూస్తే జులై 6వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది.(@APSDMA Twitter)

ఇక ఇవాళ(జులై 3) హైదరాబాద్ లో వాతావరణం చూస్తే రాత్రి సమయంలో తేలికపాటి లేదా ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల గాలులు పశ్చిమ, నైరుతి దిశలో వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

(5 / 7)

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చూస్తే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.

(6 / 7)

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చూస్తే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.

ఇక నైరుతి రుతుపవనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణశాఖ తెలిపింది. జులై 8వ తేదీ వరకు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని కానీ జులై 2వ తేదీ నాటికే అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఓ ప్రకటనలో వివరించింది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు