AP TG Weather Updates : వాయుగుండంగా మారిన అల్పపీడనం..! ఈ 3 రోజులు అత్యంత భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
- AP Telangana Rains : వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Rains : వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
(1 / 7)
వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో మరో నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(image source from @APSDMA Twitter)(2 / 7)
ఈ వాయుగుండం... రేపు అంటే జులై 20వ తేదీన తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి... పూరీ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత బలహీనపడతుందని పేర్కొంది.
(image source from @APSDMA Twitter)(3 / 7)
ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉండనుంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలు వీచే అవకాశం ఉంది.
(4 / 7)
జులై 19 మధ్యాహ్నం నుంచి 20వ తేదీ ఉదయం వరకు చూస్తే... తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(image source from @APSDMA Twitter)(5 / 7)
ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
(image source from @APSDMA Twitter)(6 / 7)
రేపు, ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కాగా… మిగిలిన జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(image source from @APSDMA Twitter)(7 / 7)
భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సామర్థ్యానికి మించి నీరు రావడంతో ప్రాజెక్టు కట్టకు భారీ గండింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేటతో పాటు పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముంపు ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక గోదావరి బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
(image source from @APSDMA Twitter)ఇతర గ్యాలరీలు