AP TG Weather Updates : అల్పపీడన ప్రభావం..! ఈ 3 రోజులు అత్యంత భారీ వర్షాలు - ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగైదు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగైదు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది.
(2 / 6)
అల్పపీడనం ప్రభావంతో రేపు ఏపీలో ప్రకాశం,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు,శ్రీకాకుళం,మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(3 / 6)
(4 / 6)
ఇక తెలంగాణలో చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచి రేపు ఉదయం 08.30 గంటల వరకు తెలంగాణలోని భద్రాత్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
(5 / 6)
ఇదే సమయంలో కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ కాగా... మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు