AP TG Weather Updates : కొనసాగుతున్న 'ద్రోణి' - 4 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుండటంతో మరో మూడు నాలుగు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుండటంతో మరో మూడు నాలుగు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
(1 / 6)
ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(Image Source From @APSDMA Twitter)(2 / 6)
సముద్ర మట్టానికి సగటును 5.8 కిమీ ఎత్తులో షీర్ జోన్ బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యనాంలో దిగువ ట్రోపోస్పిరక్ స్థాయిలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.
(Image Source From @APSDMA Twitter)(3 / 6)
ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడొచ్చని అంచనా.
(Image Source From @APSDMA Twitter)(4 / 6)
రాయలసీమ జిల్లాలోనూ మూడు నాలుగు రోజులపాటు వానలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. బలమైన గాలుల వీచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది.
(Image Source From @APSDMA Twitter)(5 / 6)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ(శుక్రవారం) పలు ప్రాంతాల్లో వర్షం పడింది. అయితే ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(Image Source From @APSDMA Twitter)ఇతర గ్యాలరీలు