(1 / 6)
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. రెండు మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(2 / 6)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం... ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 3 రోజులు స్థిరమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. గాలి వేగం గంటకు 30 -40 మధ్య ఉంటుందని తెలిపింది.
(3 / 6)
ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆగస్టు 2వ తేదీ ఉదయం 8 గంటల వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
(4 / 6)
ఇదే సమయంలో సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డిస హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపుల, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటుందని వివరించింది.
(5 / 6)
ఆగస్టు 3వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా… ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగస్టు 7వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు పడనున్నాయి.
(6 / 6)
ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్ర, సీమ జిల్లాల్లో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ(ఆగస్ట 1) శ్రీకాకుళం,మన్యం,అల్లూరి,కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు,నంద్యాల,అనంతపురం,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు