
(1 / 7)
రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో చెర్రీ, సమంత నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే, ఈ సినిమాలో సమంతకు బదులు ముందుగా వేరే హీరోయిన్‌ను అనుకున్నారట. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను మిస్ చేసుకుంది ఆ హీరోయిన్. మరి ఆ బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

(2 / 7)
రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ వినికిడి సమస్య ఉన్న చిట్టిబాబుగా నటిస్తే.. రమాలక్ష్మిగా సమంత చేసింది. అలాగే చిట్టిబాబుకు ప్రేయసిగా నటించిన సమంత గ్లామర్ డోస్‌తోపాటు నటనతో ప్రశంసలు అందుకుంది.

(3 / 7)
అయితే, రంగస్థంలో సినిమాలో హీరోయిన్‌గా సమంతకు ముందు వేరే స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట డైరెక్టర్ సుకుమార్. కానీ, ఆమె చెరువులో దిగడం, పైగా బర్రెలను తోమడం వంటి పనులు చేయనని చెప్పిందంట. దాంతో సుకుమార్ హీరోయిన్‌నే మార్చాడని టాక్.

(4 / 7)
అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, సమంత ప్లేసులో ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో కాదు మలయాళ బ్యూటి అనుపమ పరమేశ్వరన్. తన యాక్టింగ్, నటనతో కుర్రాళ్ల గుండెల్లో గూడుకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ రంగస్థలం ఛాన్స్ వదులుకుందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్, ఆమె అభిమానులు.

(5 / 7)
అయితే, రంగస్థలం సినిమాలో హీరోయిన్‌గా ముందుగా కొన్నిరోజులు అనుపమ పరమేశ్వరన్‌తో సినిమా షూటింగ్ చేశారట. రెండు షెడ్యూల్స్ షూటింగ్ అనంతరం చెరువులో బర్రెలను కడగాలని సుకుమార్ చెప్పాట. కానీ, అలా తాను చేయలేనని అనుపమ పరమేశ్వరన్ అనడంతో క్రియేటివ్ డైరెక్టర్ హీరోయిన్‌నే మార్చేశారని సమాచారం.

(6 / 7)
రంగస్థంలో రమాలక్ష్మి పాత్ర పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది. నాటుగా ఏ పని పడితే ఆ పని చేస్తూ రియాలిటీకి చాలా దగ్గరిగా ఉంటుంది. అందుకే రియలిస్ట్‌గా ఆ పాత్రను మలిచారు సుకుమార్. ఆ క్యారెక్టర్‌లో నటించిన సమంత ది బెస్ట్ ఇచ్చింది. దీంతో సామంతపై పొగడ్తలు కురిశాయి.

(7 / 7)
ఇదిలా ఉంటే, ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది అనుపమ పరమేశ్వరన్. ఇటీవల టిల్లు స్క్వేర్, డ్రాగన్ సినిమాలతో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ పరదా, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వంటి కాన్సెప్ట్ ఒరియెంటెడ్ సినిమాలు చేస్తోంది.
ఇతర గ్యాలరీలు