
(1 / 6)
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో పీజీ అడ్మిషన్లు జరుగుతున్నాయి.ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు కల్పిస్తున్నారు.

(2 / 6)
జూలై - ఆగస్ట్ సెషన్ కింద ఈ ప్రవేశాలు ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు.. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే అప్లికేషన్ల గడువు దగ్గరపడింది. అర్హులైన అభ్యర్థులు… అక్టోబర్ 10, 2025వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

(3 / 6)
పోస్టు గ్రాడ్యూయేట్ (పీజీ) ఆర్ట్స్ కోర్సులు 11 ఉన్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు (నాలుగు సెమిస్టర్స్) ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఏ హిందీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ కోర్సులున్నాయి.
(4 / 6)
పీజీ సైన్స్ ప్రోగ్రామ్స్ 8 ఉన్నాయి. ఇందులో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తో పాటు మరికొన్ని కోర్సులు ఉన్నాయి. కామర్స్ లో అకౌంటెన్సీ, బ్యాంకింగ్, ఎంబీఏ ఉన్నాయి.

(5 / 6)
లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ లో భాగంగా పీజీలో చేరవచ్చు. అయితే బీఎల్ఐసీలో డిగ్రీ కలిగి ఉండాలి. https://anucde.info/admissionnoti.php వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి.

(6 / 6)
కోర్సుల వివరాల సమాచారం తెలుసుకునేందుకు 0863-2346222 / 2346208 / 2346214 నెంబర్లను సంప్రదించవచ్చు. anucdedirector@gmail.com మెయిల్ కూడా చేయవచ్చు.
ఇతర గ్యాలరీలు