తెలుగు న్యూస్ / ఫోటో /
Fever Treatment: జ్వరానికి విరుగుడు, ఎవరైనా ఇంట్లోనే చేయగలిగిన మెరుగైన చికిత్స ఇదే..
- Fever Treatment: వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినా పెరిగినా శరీర ఉష్ణోగ్రత మాత్రం 98.4 డిగ్రీలు మాత్రమే ఉండేలా మెదడులో హైపోథాలమస్ గ్రంథి థర్మో స్టాట్ పరికరంలా పనిచేస్తుంది.సాధారణ జ్వరాలకు ఇంట్లోనే చక్కటి పరిష్కార మార్గం ఉంది. ఉష్ణోగ్రత 100డిగ్రీలను దాటితే దానిని తడివస్త్రంతోనే అదుపులోకి తీసుకురావొచ్చు.
- Fever Treatment: వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినా పెరిగినా శరీర ఉష్ణోగ్రత మాత్రం 98.4 డిగ్రీలు మాత్రమే ఉండేలా మెదడులో హైపోథాలమస్ గ్రంథి థర్మో స్టాట్ పరికరంలా పనిచేస్తుంది.సాధారణ జ్వరాలకు ఇంట్లోనే చక్కటి పరిష్కార మార్గం ఉంది. ఉష్ణోగ్రత 100డిగ్రీలను దాటితే దానిని తడివస్త్రంతోనే అదుపులోకి తీసుకురావొచ్చు.
(1 / 10)
సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 102డిగ్రీలకు మించి పెరిగితే అది ప్రమాదకర లక్షణంగా భావించాలి. చిన్నపిల్లల్లో 102 డిగ్రీలు దాటితో ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడానికి తడిగుడ్డ వైద్యం చక్కగా పనిచేస్తుంది.
(2 / 10)
సాధారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థలు పనిచేయడం ప్రారంభిస్తాయి. మొదట చెమటలు పడతాయి. చెమట చుట్టూ ఉన్న గాలికి ఆవిరయ్యే క్రమంలో శరీరంలోని వేడికి కూడా వాతావరణం గ్రహిస్తుంది. వడదెబ్బ తగిలినా, జ్వరం ఎక్కుగా ఉన్నా చెమటలు పట్టే ప్రక్రియ దెబ్బతింటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత సాధారణ స్థితికి తీసుకురావడానికి తడిగుడ్డ వైద్యం చక్కగా ఉపయోగపడుతుంది.
(3 / 10)
వడదెబ్బ తగిలినా, అధిక ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం వచ్చినా శరీరం దానంతట అది ఉష్ణోగ్రతను తగ్గించుకోలేకపోవచ్చు.
(4 / 10)
శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నపుడు తడిగుడ్డ వైద్యం చక్కగా ఉపయోగపడుతుంది. రోగి శరరీంపై మందపాటి దుస్తులను తొలగించి పల్చటి గుడ్డను ఒళ్లంతా తగిలేలా కప్పాలి. ఈ వస్త్రాన్ని తరచూ నీటితో తడపాలి.
(5 / 10)
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి కేవలం తల నుదుటి మీద మాత్రమే తడిగుడ్డ వేయడం వల్ల పరిష్కారం ఉండదు.
(6 / 10)
జ్వరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో రోగిని ఫ్యాన్ కింద ఉంచాలి. ఫ్యాన్ అందుబాటులో లేకపోతే ఆరుబయట, నీడగా ఉండే చెట్ల కింద ఉంచాలి. తడి వ్త్రం ఆరిపోతే దానిని తడుపుతూ ఉండాలి. తడి వస్త్రం ఒంట్లో వేడిని లాక్కుంటుంది. ఇలా చేస్తే ఐదారు నిమిషా వ్యవధిలోనే ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 100-102 డిగ్రీలు ఉన్నపుడు తడిగుడ్డ వైద్యం చక్కగా పనిచేస్తుంది.
(7 / 10)
శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీలు దాటినా తడిగుడ్డ వైద్యం పనిచేస్తుంది. మందులకు లొంగని జ్వరంగా కూడా తడిగుడ్డ వైద్యానికి తగ్గుతుంది. మందులు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో తడిగుడ్డ వైద్యం చక్కగా పనిచేస్తుంది.
(8 / 10)
తడిగుడ్డ కప్పితే చిన్నపిల్లలు చలిగా ఉందని మారం చేసినా వాటిని కొనసాగించాలి. మందపాటి దుప్పటి కప్పుకోవాలని ప్రయత్నిస్తారు. ఇలా చేస్తే శరీరంలో వేడి బయటకు వెళ్లే అవకాశం ఉండదు. రోగికి ఇబ్బందిగా ఉన్నా తడిగుడ్డ వైద్యాన్ని కొనసాగించాలి.
(9 / 10)
జ్వరం తీవ్రంగా ఉన్నా, మందులు అందుబాటులో లేకున్నా, మందు వేసుకున్న అరగంటలోగా జ్వరం తగ్గకపోతే అది ప్రమాదకరం అవుతుంది. ఈ ప్రమాదాలను ఆపడానికైనా రోగిని తడిబట్టతో కప్పాలి. ఉష్ణోగ్రత 100డిగ్రీలకు వచ్చే వరకు తడి బట్టతో శరీరాన్ని తుడుస్తుండటమే చక్కటి వైద్యంగా పనిచేస్తుంది.
ఇతర గ్యాలరీలు