(1 / 6)
బాబా వంగా తెలియని వారు తక్కువే. ఆమె ఏం చెబితే అదే జరిగేది. ఈ బల్గేరియన్ మహిళ తన మరణానికి ముందు ప్రపంచంలో జరగబోయేది అంచనా వేసింది. . వాటిలో చాలా వరకు జరిగాయి. 1989లో బెర్లిన్ గోడ కూలిపోవడం, కరోనా వైరస్ మహమ్మారి, ప్రిన్సెస్ డయానా మరణం వరకు ఆమె ఎన్నో ముందుగానే సరిగా అంచనా వేసింది
(2 / 6)
బ్రిటన్ కు చెందిన క్రెయిగ్ హామిల్టన్ పార్కర్ బాబా వంగాలాగే ముందుగానే విపత్తులను అంచనా వేస్తున్నాడు. అతను తన యూట్యూబ్ ఛానెల్ లో వివిధ అంశాలపై అంచనాలను చర్చిస్తాడు. అతను బ్రిటన్ నివాసి. అతన్ని బాబా వంగా, నోస్ట్రడామస్ లతో పోలుస్తారు. కొన్ని రోజుల క్రితం, హామిల్టన్ తన యూట్యూబ్ ఛానెల్లో ఒక నౌక లేదా ఆయిల్ ట్యాంకర్ కు ప్రమాదం జరుగుతుందని చెప్పారు
(3 / 6)
అతను చెప్పినట్టే మార్చి 11న ఉత్తర సముద్రంలో చమురు ట్యాంకర్, ఓడ ఢీకొన్నాయి. ఈ ట్యాంకర్లో 18,000 టన్నుల విమాన ఇంధనం ఉంది. ఎంవీ స్టెనా ఇమాక్యులేట్ అనే ట్యాంకర్ ఎంవీ సోలాంగ్ ను ఢీకొట్టింది. అతను అంచనా వేసిన వారం రోజుల తరువాతే ఇలా జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
(AP)(4 / 6)
ఈ ఘటనలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అంతరిక్షం నుంచి కూడా చూడగలిగేంతగా పొగ సముద్రం అంతటా వ్యాపించింది. ఎంవీ సోలాంగ్ కు చెందిన 13 మంది ఉద్యోగులను సురక్షితంగా ఉన్నారు. గల్లంతైన వారిలో ఒకరు మృతి చెందారు. స్టెనా ఇమాక్యులేట్ లోని 23 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
(AP)(5 / 6)
(6 / 6)
అయితే ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే ఆయన అంచనాలు నిజమయ్యాయి. 2024 జూలైలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగే అవకాశం ఉందన్నారు. రెండు రోజుల తర్వాత అతనిపై దాడి జరిగింది. తాను భారతీయ జ్యోతిష పద్ధతులను ఉపయోగిస్తానని హామిల్టన్ పార్కర్ చెప్పారు. తాను భారతదేశానికి వచ్చినప్పుడు ఆ పద్ధతిని నేర్చుకున్నాడు.
ఇతర గ్యాలరీలు