TG Indiramma Housing Scheme Updates : ప్రాథమిక జాబితాలు వచ్చేశాయ్ - ఫైనల్ లిస్ట్ కోసం ఏం చేస్తారంటే..?
- TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా జరిగిన గ్రామసభల్లో ప్రాథమికంగా గుర్తించిన అర్హుల జాబితాను ప్రకటించారు. గ్రామాలవారీగా పేర్లను ఖరారు చేశారు. అంతేకాకుండా కొత్త దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయితే అందరిలోనూ ఫైనల్ లిస్ట్ ఆసక్తిని రేపుతోంది.
- TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా జరిగిన గ్రామసభల్లో ప్రాథమికంగా గుర్తించిన అర్హుల జాబితాను ప్రకటించారు. గ్రామాలవారీగా పేర్లను ఖరారు చేశారు. అంతేకాకుండా కొత్త దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయితే అందరిలోనూ ఫైనల్ లిస్ట్ ఆసక్తిని రేపుతోంది.
(1 / 8)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలోనూ సర్వే పూర్తయింది. తాజాగా అన్ని గ్రామాల్లోనూ 4 రోజుల పాటు గ్రామసభలను కూడా నిర్వహించారు.
(2 / 8)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి గ్రామసభల్లో పలువురు పేర్లను చదివి వినిపించారు. అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రాథమిక జాబితాలను ప్రకటించారు. అయితే ఇందులో పలువురి పేర్లు లేకపోవటంతో….ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం… గ్రామసభల ద్వారా కూడా కొత్త దరఖాస్తులను స్వీకరించింది.
(3 / 8)
ప్రాథమికంగా విడుదల చేసిన జాబితాలు ఫైనల్ కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను మాత్రమే గుర్తించి ప్రకటించినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని పలువురు మంత్రులు కూడా చెప్పారు.
(4 / 8)
ఎక్కడా కూడా లబ్దిదారుల జాబితాను ప్రకటించడం లేదు. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 26న ప్రభుత్వం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయి కసరత్తు తర్వాత లబ్దిదారుల జాబితాను (నియోజకవర్గానికి 3,500 మందిని) ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.
(5 / 8)
ప్రాథమిక జాబితాలు ప్రకటించిన నేపథ్యంలో… లిస్టులో ఉన్న పేర్లను మరోసారి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీల సాయంతో…. పూర్తిస్థాయిలో విచారిస్తారు.
(6 / 8)
లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలను మరోసారి అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. సమగ్రంగా పరిశీలించిన తర్వాతనే పూర్తిస్థాయి జాబితాను రూపొందించనుంది. ఇదే విషయంపై అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. జనవరి 26వ తేదీన స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించినప్పటికీ…. ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేందుకు కొత్త సమయం పట్టే అవకాశం ఉంది.
(7 / 8)
తుది జాబితాను రూపొందించిన తర్వాత ఆ వివరాలను జిల్లాల ఇంఛార్జ్ మంత్రులకు పంపుతారు. వీటికి జిల్లా ఇంఛార్జ్ మంత్రుల ఆమోదం తప్పనిసరి చేశారు. అక్కడ్నుంచి.. జిల్లా కలెక్టర్ వద్దకు చేరాల్సి ఉంటుంది.
ఇతర గ్యాలరీలు