తెలుగు న్యూస్ / ఫోటో /
TG Indiramma Housing Survey Updates : కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే - ఈ ముఖ్యమైన విషయం తప్పక తెలుసుకోండి..!
- TG Indiramma Housing Survey Applications : ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. అయితే దరఖాస్తుదారుల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరు మరణించటంతో సర్వేలో సమస్యగా మారుతోంది. అయితే ఇలాంటి వారి విషయంలో ఇబ్బందులు రాకుండా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
- TG Indiramma Housing Survey Applications : ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. అయితే దరఖాస్తుదారుల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరు మరణించటంతో సర్వేలో సమస్యగా మారుతోంది. అయితే ఇలాంటి వారి విషయంలో ఇబ్బందులు రాకుండా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
(1 / 9)
తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సగానికిపైగా సర్వే పూర్తైంది. జనవరి ఫస్ట్ వీక్ లేదా సంక్రాంతిలోపే సర్వే ప్రక్రియ పూర్తి కానుంది. కొన్నిచోట్ల సాంకేతిక ఇబ్బందులతో సర్వే నెమ్మదిగా నడుస్తోంది.
(2 / 9)
గ్రామాల్లో, వార్డుల్లో సర్వేయర్లు వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి రోజూ ఒక్కో సర్వేయర్ 20 నుంచి 30లోపు అప్లికేషన్ల వివరాలను యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు. సిగ్నల్ సమస్య ఉన్న గ్రామాల్లో 5 నుంచి 10 దరఖాస్తులు కూడా పూర్తి కావటం లేదు.
(3 / 9)
ప్రస్తుతం ఇందిరమ్మ సర్వే జరుగుతుండగా దరఖాస్తుదారుల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజాపాలనలో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివరాలను ప్రభుత్వం ఆన్ లైన్ చేసింది. వీటి ఆధారంగానే ప్రస్తుతం సర్వే కూడా జరుపుతోంది.
(4 / 9)
అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరు మరణించటంతో ఇబ్బందులు తెరపైకి వచ్చాయి. యాప్ లో వారి పేరు కనిపిస్తున్నప్పటికీ.. సదరు దరఖాస్తుదారుడు మరణించటంతో ఎలా సర్వే చేస్తారనేది ప్రశ్నగా మారింది. ఇలాంటి సమస్య కొన్నిచోట్ల తెరపైకి రావటంతో... ప్రభుత్వంతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు.
(5 / 9)
ఒకవేళ దరఖాస్తు చేసిన వారు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇటీవలే మంత్రి పొంగులేటి చెప్పారు. ఇదే కాకుండా... దరఖాస్తుదారుడికి భార్య ఉంటే... ఆమె వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు. ఫొటోలను తీసి అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఈ సర్వే ఫామ్ లో రిమార్క్స్ రాస్తున్నారు. దరఖాస్తుదారుడు మరణించటంతో కుటుంబ సభ్యుల వివరాలను, ఫొటోలను తీసినట్లు పేర్కొంటున్నారు.
(6 / 9)
ఇదే విషయంపై రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ సర్వేయర్ ను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు సంప్రదించగా క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తుదారుడు మృతి చెందితే భార్య లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలను ఎంట్రీ చేస్తున్నామని చెప్పారు. రిమార్క్ తప్పకుండా రాస్తున్నామని వివరించారు.
(7 / 9)
సంక్రాంతి సమయానికి లబ్ధిదారుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావటంతో.. అర్హత కలిగిన వారిని గుర్తించటం సవాల్ గా మారిపోయింది. అయితే గ్రామ సభ ఆమోదం తర్వాతనే… ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.ఈ పేర్లకే జిల్లా కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.
(8 / 9)
మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు విడతలుగా జమ చేస్తారు.
ఇతర గ్యాలరీలు