(1 / 9)
శాండిల్ వుడ్‌లో రూపొందిన కాంతార సినిమాా యావత్ భారతదేశాన్ని అలరించిన విషయం తెలిసిందే. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
(Image source\ IMDb)(2 / 9)
మంచి విజయాన్ని అందుకున్న కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతారా చాప్టర్ 1 మూవీ రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి కాంతారా చాప్టర్ 1 టీమ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇవాళ ఈ సినిమాలోని నటుడు రాకేష్ పూజారి కన్నుమూశారు.
(3 / 9)
'కాంతరా చాప్టర్'లో రాకేష్ పూజారి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నాడు రాకేష్. అయితే ఇవాళ (మే 12) తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా రాకేష్ పూజారి మరణించారు.
(4 / 9)
మే 11న 'కాంతారా' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రాకేష్ తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి కోసం కర్కాలకు వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి పెళ్లి ఇంట్లో డాన్స్ కూడా చేశాడు.
(5 / 9)
అయితే ఈరోజున సోమవారం (మే 12) తెల్లవారు జామున లో బీపీ కారణంగా రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త విని ఆయన సన్నిహితులు, కర్ణాటక ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. దీనితో కాంతారా సినిమా టీమ్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయింది.
(6 / 9)
ఇటీవల కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ బైందూర్ కొల్లూరు సమీపంలోని సౌపర్ణిక నదిలో మునిగి చనిపోయాడు. షూటింగ్‌లో పాల్గొనకుండా ఈతకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని హోంబలే ఫిల్మ్స్ అధికారిక ప్రకటనలో తెలిపింది.
(7 / 9)
గత ఏడాది నవంబర్‌లో ఇదే సినిమా చాప్టర్ 1 సెట్స్‌లో జూనియర్ ఆర్టిస్టులకు జీతాలు ఇవ్వలేదని, వసతితో పాటు భోజనం పెట్టడం లేదని ఆరోపణలు వచ్చాయి.
(8 / 9)
కాంతారా సినిమా జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న మినీ బస్సు కొల్లూరు సమీపంలోని జడ్కల్ సమీపంలో బోల్తా పడిన విషయం తెలిసిందే. బస్సులో ఉన్న 20 మందిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
(9 / 9)
ఈ ఏడాది జనవరిలో హేరూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని గోమాల భూమిలో జరిగిన కాల్పుల్లో కాంతారా బృందం అడవికి నిప్పుపెట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
ఇతర గ్యాలరీలు