Animal Pre Release Event: ట్రైలర్ చూసి మెంటలొచ్చేసింది అంతే: యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు
- Animal Pre Release Event: యానిమల్ మూవీ ట్రైలర్ చూసి మెంటలొచ్చేసింది అంతే అంటూ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు అన్నాడు. సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఈ మూవీ ఈవెంట్ ఘనంగా జరిగింది. మహేష్ బాబు, రాజమౌళి ప్రత్యేక అతిథులుగా వచ్చారు.
- Animal Pre Release Event: యానిమల్ మూవీ ట్రైలర్ చూసి మెంటలొచ్చేసింది అంతే అంటూ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు అన్నాడు. సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఈ మూవీ ఈవెంట్ ఘనంగా జరిగింది. మహేష్ బాబు, రాజమౌళి ప్రత్యేక అతిథులుగా వచ్చారు.
(1 / 10)
Animal Pre Release Event: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక, రణ్‌బీర్ లతో వీళ్లు ఫొటోలకు పోజులిచ్చారు.
(2 / 10)
Animal Pre Release Event: ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరు సూపర్ స్టార్లు మహేష్ బాబు, రణ్‌బీర్ కపూర్ ఇలా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. తాను కలిసిన తొలి సూపర్ స్టార్ మహేష్ అని, అతడు నటించిన ఒక్కడు సినిమా తాను చూసినట్లు ఈ సందర్భంగా రణ్‌బీర్ చెప్పాడు.
(3 / 10)
Animal Pre Release Event: రణ్‌బీర్ కపూర్ కి తాను వీరాభిమానినని, ఇండియాలో బెస్ట్ యాక్టర్ అతడే అని మహేష్ బాబు అనడం ఆశ్చర్యం కలిగించింది. గతంలో తాను అదే మాట రణ్‌బీర్ కు చెప్పిన అతడు పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు మరోసారి చెబుతున్నానని మహేష్ అన్నాడు. యానిమల్ ట్రైలర్ చూసి మెంటలొచ్చేసిందంతే అని అతడు చెప్పాడు.
(4 / 10)
Animal Pre Release Event: సినిమా అంటే ఇలాగే తీయాలన్న రూల్స్ పక్కన పెట్టి నాకు నచ్చినట్లు తీస్తాననే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అని, అప్పట్లో రాంగోపాల్ వర్మ, ఇప్పుడు సందీప్ అలాంటి డైరెక్టర్లని రాజమౌళి అనడం విశేషం.
(5 / 10)
Animal Pre Release Event: డైరెక్టర్ రాజమౌళి.. రణ్‌బీర్ కపూర్ పై ప్రశంసలు కురిపించాడు. అతడు తన ఫేవరెట్ యాక్టర్ అని జక్కన్న అనడం విశేషం. ఈ సందర్భంగా రాజమౌళి కాళ్లు మొక్కాడు రణ్‌బీర్ కపూర్.
(6 / 10)
Animal Pre Release Event: యానిమల్ లో ఫిమేల్ లీడ్ గా నటించిన రష్మిక మందన్నా గ్రీన్ కలర్ శారీలో చాలా అందంగా కనిపించింది.
(7 / 10)
Animal Pre Release Event: యానిమల్ మూవీలో విలన్ పాత్ర పోషించిన బాబీ డియోల్ ఇలా ఓ డిఫెరెంట్ స్లీవ్ లెస్ డెనిమ్ షర్ట్ లో ప్రత్యేకంగా కనిపించాడు.
(8 / 10)
Animal Pre Release Event: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కాసేపు తన విచిత్రమైన స్పీచ్ తో నవ్వించారు. నువ్వు ఏడాదిలోగా హైదరాబాద్ వచ్చి సెటిలవ్వాలని రణ్‌బీర్ ను ఆయన కోరడం విశేషం. ఇక మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా చూసిన తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానని మల్లారెడ్డి అనడంతో అక్కడున్న వాళ్లంతా పెద్దగా నవ్వారు.
(9 / 10)
Animal Pre Release Event: యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ కి తండ్రి పాత్ర పోషిస్తున్న అనిల్ కపూర్ అయితే ఈ ఈవెంట్లో చెలరేగిపోయాడు. మహేష్ బాబు స్టేజ్ పైకి రాగానే అతని పోకిరి పాటపై స్టెప్పులేశాడు. మహేష్ ని కూడా డ్యాన్స్ చేయాలని ఒత్తిడి తెచ్చినా అతడు సిగ్గు పడుతూ.. అనిల్ కపూర్ ని హగ్ చేసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు