Andhra Sweets : ఆత్రేయపురం పూతరేకులు నుంచి బందరు లడ్డు వరకు- టాప్ 10 ఆంధ్రా స్వీట్స్, ఓసారి రుచిచూడాల్సిందే!-andhra traditional sweets atreyapuram putharekulu bandar laddu gottam kaja taste it once ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Andhra Sweets : ఆత్రేయపురం పూతరేకులు నుంచి బందరు లడ్డు వరకు- టాప్ 10 ఆంధ్రా స్వీట్స్, ఓసారి రుచిచూడాల్సిందే!

Andhra Sweets : ఆత్రేయపురం పూతరేకులు నుంచి బందరు లడ్డు వరకు- టాప్ 10 ఆంధ్రా స్వీట్స్, ఓసారి రుచిచూడాల్సిందే!

Jan 26, 2025, 08:01 PM IST Bandaru Satyaprasad
Jan 26, 2025, 08:01 PM , IST

Andhra Sweets : ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సౌందర్యానికే కాదు, పసందైన వంటకాలకూ ఫేమస్. ఆంధ్రా స్వీట్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోనూ ఎగబడతారు. ఆత్రేయపురం పూతరేకులు, బందరు లడ్డు, కాకినాడ కాజా...ఇలా స్వీట్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఏపీ టాప్ 10 స్వీట్స్ గురించి తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సౌందర్యానికే కాదు, పసందైన వంటకాలకూ ఫేమస్. ఆంధ్రా స్వీట్స్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోనూ ఎగబడతారు. ఆత్రేయపురం పూతరేకులు, బందరు లడ్డు, కాకినాడ కాజా...ఇలా స్వీట్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఏపీలో ప్రాంతానికో స్వీట్ ఫేమస్. వీలుదొరికితే ఓసారి రుచిచూసేయండి.  

(1 / 6)

ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సౌందర్యానికే కాదు, పసందైన వంటకాలకూ ఫేమస్. ఆంధ్రా స్వీట్స్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోనూ ఎగబడతారు. ఆత్రేయపురం పూతరేకులు, బందరు లడ్డు, కాకినాడ కాజా...ఇలా స్వీట్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఏపీలో ప్రాంతానికో స్వీట్ ఫేమస్. వీలుదొరికితే ఓసారి రుచిచూసేయండి.  

పూతరేకులు-వీటినే "పేపర్ స్వీట్" అని కూడా పిలుస్తారు. ఇవి ఆత్రేయపురం ఫేమస్ స్వీట్. బియ్యం పిండితో సన్నని రేకులుగా వీటిని తయారు చేస్తారు. బెల్లం, చక్కెర, నెయ్యితో ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేస్తారు. ఆత్రేయపురం పూతరేకులు... ప్రత్యేక వారసత్వం, చరిత్రను హైలైట్ చేస్తూ ఇటీవలే భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ని పొందింది. అరిసెలు - అరిసెలు నువ్వుల గింజలు, వేయించిన బియ్యం పిండి, బెల్లంతో తయారుచేస్తారు. ఈ స్వీట్ ను సంక్రాంతి పండుగలో చేస్తారు.   

(2 / 6)

పూతరేకులు-వీటినే "పేపర్ స్వీట్" అని కూడా పిలుస్తారు. ఇవి ఆత్రేయపురం ఫేమస్ స్వీట్. బియ్యం పిండితో సన్నని రేకులుగా వీటిని తయారు చేస్తారు. బెల్లం, చక్కెర, నెయ్యితో ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేస్తారు. ఆత్రేయపురం పూతరేకులు... ప్రత్యేక వారసత్వం, చరిత్రను హైలైట్ చేస్తూ ఇటీవలే భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ని పొందింది.

 

అరిసెలు - అరిసెలు నువ్వుల గింజలు, వేయించిన బియ్యం పిండి, బెల్లంతో తయారుచేస్తారు. ఈ స్వీట్ ను సంక్రాంతి పండుగలో చేస్తారు.  
 

 బొబ్బట్లు - ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో చేసే సంప్రదాయ స్వీట్ బొబ్బట్లు. పండుగ సమయాల్లో బెల్లం, శనగపప్పు, యాలకులతో చేస్తారు.   మాడుగుల హల్వా-  మాడుగుల పట్టణంలో తయారుచేసే ప్రత్యేకమైన స్వీట్ ఇది. గోధుమ పాలు, పంచదార, నెయ్యితో తయారు చేస్తారు. ఇది ఈ ప్రాంతం వంటల ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది.  

(3 / 6)

 బొబ్బట్లు - ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో చేసే సంప్రదాయ స్వీట్ బొబ్బట్లు. పండుగ సమయాల్లో బెల్లం, శనగపప్పు, యాలకులతో చేస్తారు.  

 

మాడుగుల హల్వా-  మాడుగుల పట్టణంలో తయారుచేసే ప్రత్యేకమైన స్వీట్ ఇది. గోధుమ పాలు, పంచదార, నెయ్యితో తయారు చేస్తారు. ఇది ఈ ప్రాంతం వంటల ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది. 
 

కాకినాడ గొట్టం కాజా -కాకినాడలో తయారు చేసే ఈ ఐకానిక్ స్వీట్ బయటకు పొరలుగా ఉంటూ, జ్యూసీ సిరప్ ఉంటే స్వీట్. మైదా, పంచదార, నెయ్యితో ప్రత్యేకమైన తయారీ విధానంలో చేస్తారు.  తాపేశ్వరం మడత కాజా- తాపేశ్వరం మడత కాజాను గోధుమ పిండితో తయారు చేస్తారు. పొరలుగా ఉంటే స్వీట్ పదార్థం ఇది. తరతరాలుగా ప్రత్యేకమైన విధానంలో వీటిని తయారు చేస్తున్నారు.   

(4 / 6)

కాకినాడ గొట్టం కాజా -కాకినాడలో తయారు చేసే ఈ ఐకానిక్ స్వీట్ బయటకు పొరలుగా ఉంటూ, జ్యూసీ సిరప్ ఉంటే స్వీట్. మైదా, పంచదార, నెయ్యితో ప్రత్యేకమైన తయారీ విధానంలో చేస్తారు.

  

తాపేశ్వరం మడత కాజా- తాపేశ్వరం మడత కాజాను గోధుమ పిండితో తయారు చేస్తారు. పొరలుగా ఉంటే స్వీట్ పదార్థం ఇది. తరతరాలుగా ప్రత్యేకమైన విధానంలో వీటిని తయారు చేస్తున్నారు.  
 

బందరు లడ్డు- మచిలీపట్నంలో తయారు చేసే ఐకానిక్ స్వీట్ బందరు లడ్డు. శనగపిండి, బెల్లం, నెయ్యితో ఈ స్వీట్ చేస్తారు.   కోవా బిల్లలు - పాలకోవ బిల్లలు ముఖ్యంగా రాయలసీమలో సంప్రదాయ స్వీట్. నాణెం ఆకారంతో వీటిని తయారు చేస్తారు. స్వచ్ఛమైన పాలు, చక్కెరతో చేస్తారు.   

(5 / 6)

బందరు లడ్డు- మచిలీపట్నంలో తయారు చేసే ఐకానిక్ స్వీట్ బందరు లడ్డు. శనగపిండి, బెల్లం, నెయ్యితో ఈ స్వీట్ చేస్తారు.  

 

కోవా బిల్లలు - పాలకోవ బిల్లలు ముఖ్యంగా రాయలసీమలో సంప్రదాయ స్వీట్. నాణెం ఆకారంతో వీటిని తయారు చేస్తారు. స్వచ్ఛమైన పాలు, చక్కెరతో చేస్తారు.  
 

చలిమిడి- ఏపీ తీర ప్రాంతాల్లో ఒక క్లాసిక్ స్వీట్ చలిమిడి. పండుగలు, సారెల్లో చలిమిడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేస్తారు.   సున్నుండలు- సున్నుండలు సంప్రదాయ ఆంధ్ర స్వీట్. రాయలసీమలో ఫేమస్. వేయించిన మినుములు, బెల్లం, నెయ్యితో తయారు చేస్తారు. పోషకాలు అధికంగా ఉండే మృదువైన గుండ్రని ఆకారంలో వీటిని తయారు చేస్తారు.  పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారుచేస్తారు. 

(6 / 6)

చలిమిడి- ఏపీ తీర ప్రాంతాల్లో ఒక క్లాసిక్ స్వీట్ చలిమిడి. పండుగలు, సారెల్లో చలిమిడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేస్తారు.  

 

సున్నుండలు- సున్నుండలు సంప్రదాయ ఆంధ్ర స్వీట్. రాయలసీమలో ఫేమస్. వేయించిన మినుములు, బెల్లం, నెయ్యితో తయారు చేస్తారు. పోషకాలు అధికంగా ఉండే మృదువైన గుండ్రని ఆకారంలో వీటిని తయారు చేస్తారు.  పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారుచేస్తారు.
 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు