(1 / 6)
ఏపీలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మంగళవారం
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు , ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
(2 / 6)
రేపు(ఏప్రిల్ 9) తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
(3 / 6)
ఎల్లుండి(ఏప్రిల్ 10) తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
(4 / 6)
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో నేడు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
(5 / 6)
దక్షిణ కోస్తా, రాయలసీమలో...రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
(6 / 6)
కోస్తా ఆంద్రప్రదేశ్, యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు రాయలసీమలో రాగల మూడు రోజుల్లో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముందని, ఆ తరువాత స్వల్పంగా తగ్గే అవకాశముందని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు