(1 / 5)
ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? అదేనండీ.. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి. యాంకర్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా, నటిగా కెరీర్ కొనసాగిస్తోంది అషు.
(instagram-Ashu Reddy)(2 / 5)
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో గ్లామరస్ ఫొటోలు పోస్టు చేసింది అషు రెడ్డి. కిరాక్ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలు పంచుకుంది. షూట్ మోడ్, యోలో, హై హీల్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ లు యాడ్ చేసింది.
(instagram-Ashu Reddy)(3 / 5)
ప్రస్తుతం టీవీ షోలతో పాటు ఇతర ఈవెంట్లు చేస్తోంది అషు రెడ్డి. ఈటీవీలో వస్తున్న ఫ్యామిలీ స్టార్స్ లో మెయిన్ యాంకర్ సుడిగాలి సుధీర్ తో కలిసి సందడి చేస్తోంది ఈ ముద్దు గుమ్మ.
(instagram-Ashu Reddy)(4 / 5)
అమెరికాలో పుట్టిన అషు రెడ్డి డబ్ స్మాష్ వీడియోలు, టిక్ టాక్ తో ఫేమస్ అయింది. జూనియర్ సమంత అనే పేరు తెచ్చుకుంది. పద్మవ్యూహంలో చక్రధారి, యేవమ్, చల్ మోహన్ రంగా సినిమాల్లో నటించింది. ఎవరు ఎప్పుడు ఎక్కడ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది.
(instagram-Ashu Reddy)(5 / 5)
అషు రెడ్డికి 2024లో బ్రెయిన్ సర్జరీ అయింది. డాక్టర్లు ఆరు నెలల విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ సర్జరీ అయిన రెండు నెలలకే అషు రెడ్డి మళ్లీ షూటింగ్ మొదలెట్టింది. ఆర్జీవీతో అషు రెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూ తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
(instagram-Ashu Reddy)ఇతర గ్యాలరీలు