అనసూయ కొత్త ఇల్లు చూశారా? గృహ ప్రవేశం చేసిన బ్యూటీ.. ఫొటోలు వైరల్.. కొత్తిల్లు ఎంత బాగుందో చూడండి-anasuya bharadwaj new home house warming ceremony photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అనసూయ కొత్త ఇల్లు చూశారా? గృహ ప్రవేశం చేసిన బ్యూటీ.. ఫొటోలు వైరల్.. కొత్తిల్లు ఎంత బాగుందో చూడండి

అనసూయ కొత్త ఇల్లు చూశారా? గృహ ప్రవేశం చేసిన బ్యూటీ.. ఫొటోలు వైరల్.. కొత్తిల్లు ఎంత బాగుందో చూడండి

Published May 12, 2025 10:04 PM IST Hari Prasad S
Published May 12, 2025 10:04 PM IST

అనసూయ భరద్వాజ్ కొత్త ఇంట్లోకి వెళ్లింది. గృహ ప్రవేశం చేస్తున్న ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తన కొత్త ఇంటికి శ్రీరామ సంజీవని అనే పేరు పెట్టడం విశేషం. మరి ఆమె కొత్త ఇల్లు ఎలా ఉందో చూడండి.

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తన భర్త, పిల్లలతో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది.

(1 / 6)

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తన భర్త, పిల్లలతో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది.

ఆ సీతారామాంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో.. మా జీవితంలోని మరో అధ్యాయం.. శ్రీరామ సంజీవని.. మా కొత్తింటి పేరు అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.

(2 / 6)

ఆ సీతారామాంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో.. మా జీవితంలోని మరో అధ్యాయం.. శ్రీరామ సంజీవని.. మా కొత్తింటి పేరు అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.

తన భర్త, పిల్లలతో కలిసి అనసూయ తన కొత్త ఇంటి ముందు ఇలా కెమెరాకు పోజులిచ్చింది.

(3 / 6)

తన భర్త, పిల్లలతో కలిసి అనసూయ తన కొత్త ఇంటి ముందు ఇలా కెమెరాకు పోజులిచ్చింది.

తెలుగు సాంప్రదాయం ప్రకారం పాలు పొంగించి నూతన గృహ ప్రవేశం చేసింది అనసూయ.

(4 / 6)

తెలుగు సాంప్రదాయం ప్రకారం పాలు పొంగించి నూతన గృహ ప్రవేశం చేసింది అనసూయ.

అనసూయ కొత్త ఇంటికి సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

(5 / 6)

అనసూయ కొత్త ఇంటికి సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గృహ ప్రవేశం సందర్భంగా ఆమె తన భర్త, పిల్లలతో కలిసి ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా కనిపించింది.

(6 / 6)

గృహ ప్రవేశం సందర్భంగా ఆమె తన భర్త, పిల్లలతో కలిసి ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా కనిపించింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు