(1 / 10)
బుల్లితెర నుంచి వెండితెరకు వెలిగిన తారల్లో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. మొదట సినిమాల్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అంతగా రాణించలేకపోయింది.
(2 / 10)
ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ స్టార్ చేసిన అనసూయ భరద్వాజ్ మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా రాణించింది.
(3 / 10)
యాంకర్ కంటే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించిన అనసూయ భరద్వాజ్ టీవీ రంగంలో క్రేజీ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.
(4 / 10)
ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈ షోలో కామెడీతోపాటు అనసయూ గ్లామర్ షో అట్రాక్ట్ చేశాయి.
(5 / 10)
క్షణం, రంగస్థలం, ఖిలాడీ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన అనసూయ భీష్మ పర్వం వంటి మలయాళ మూవీలో కూడా నటించింది.
(6 / 10)
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పలు టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అనసూయ న్యాయ నిర్ణేతగా ఉన్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది.
(7 / 10)
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే సందర్భంగా పర్పుల్ కలర్ బ్లౌజ్, యెల్లో ఫ్రాక్‌లో దర్శనం ఇచ్చిన అనసూయ భరద్వాజ్ గ్లామర్ షో చేసింది.
(8 / 10)
స్లీవ్‌లెస్ జాకెట్‌లో వివిధ రకాలుగా పోజులిస్తూ నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేసింది అనసూయ. ఇవాళ (జూన్ 22) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నెసెసిటీ (అవసరం) అంటూ అనసూయ గ్లామర్ ఫొటోలు షేర్ చేసింది.
(9 / 10)
హాట్ అందాలతో అదరగొట్టిన అనసూయ భరద్వాజ్ న్యూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు.
(10 / 10)
'చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప' అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరికొంతమంది బ్యూటిఫుల్ అంటూ లవ్, ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు.
ఇతర గ్యాలరీలు